OTT Subscription Fee Hike: కర్ణాటక ప్రభుత్వం సినిమా లవర్స్‌కి గట్టి షాక్ ఇవ్వనుంది. మూవీ టికెట్స్‌పై సెస్‌ని పెంచే యోచనలో ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశముంది. అంతే కాదు. OTT సబ్‌స్క్రిప్షన్‌ ఫీ కూడా భారీగానే పెంచనుంది. సినిమాని, కల్చరల్ ఆర్ట్స్‌ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ప్రతి మూడేళ్లకి సెస్‌ని రివైజ్ చేస్తుంటారు. 1-2% మేర పన్ను పెంచే అకాశముంది. సినిమా టికెట్స్‌తో పాటు, సబ్‌స్క్రిప్షన్ ఫీజ్‌లపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటికే Karnataka Cine and Cultural Activists Welfare Billని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సినిమా ఆర్టిస్ట్‌ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా 7గురు సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ బిల్ ప్రతిపాదించింది. ఈ కమిటీ ద్వారా ఆయా ఆర్టిస్ట్‌లకు ఆర్థిక సాయం అందించాలని చూస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే యాక్టర్‌లు, మ్యుజీషియన్‌లు, డ్యాన్సర్‌లతో పాటు మిగతా వాళ్లందరికీ ఈ భరోసా ఇస్తామని బిల్‌లో  ప్రస్తావించింది ప్రభుత్వం. సినిమాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించే నాటకాలపైనా సెస్‌ పెంచాలని భావిస్తోంది.