Pawan Kalyan Attended Graduation Ceremony in Singapore: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కొణిదెల సింగపూర్‌లో సందడి చేశారు. అక్కడ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరకానున్నారు. ఈ సంద్భంగా ఆ కార్యక్రమానికి వెళుతున్న పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలు సోషల్‌ మీడయాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఆయన స్కై బ్లూ షర్ట్‌, క్రిం కలర్‌ ఫ్యాంటులో కనిపించారు.


డిప్యూటీ సీఎం అయిన పవన్‌ సింపుల్‌ ఫార్మల్‌ లుక్‌ కనిపించడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవల పవన్‌ కళ్యాన్‌ తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన సంగతి తెలిసిందే. చూస్తుంటే ఆయన భార్యా గ్రాడ్యూయేషన్‌ కార్యక్రమానికి పవన్ కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోల్లో ఆయన భార్య లెజ్నెవా గ్రాడ్యూవేషన్ డే డ్రెస్ వేసుకుని పవన్ పక్కనే నడుస్తూ కనిపించింది.  







Also Read: 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్‌తోనే అల్లు అర్జున్ సినిమా - ఇది అత్యంత భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ - బన్నీవాసు