విజయ్ సేతుపతి - త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన '96' చూశారా? ఆ సినిమాను తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేశారు. అందులో శర్వానంద్, సమంత యాక్ట్ చేశారు. అరవింద్ స్వామి - కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన 'సత్యం సుందరం' చూశారా? ఆ సినిమాలకు ప్రేమ్ కుమార్ దర్శకుడు. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన చిత్రాల్ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్... ప్రస్తుతం రూట్ మార్చినట్టుగా కనిపిస్తోంది.

Continues below advertisement


ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హీరోగా ఫహాద్ ఫాజిల్!
'సత్యం సుందరం' తర్వాత కోలీవుడ్ స్టార్, తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలిసిన చియాన్ విక్రమ్‌ (Chiyaan Vikram)తో ప్రేమ్ కుమార్ మూవీని చేయాల్సి ఉంది. విక్రమ్‌తో చేస్తున్న మూవీకి సంబంధించిన రైటింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదట. దానికి ఇంకా చాలా సమయం పడుతుందట. కానీ, 'పుష్ప' విలన్ - మలయాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్ (Fahadh Faasil)తో చేయాలనుకున్న యాక్షన్ డ్రామా కథ మాత్రం రెడీగా ఉందట. ఈ ఐడియా నాలుగేళ్ల క్రితమే వచ్చిందట. అందుకే కథ రెడీగా ఉంది కాబట్టి.. ఫహాద్‌తో ముందుగా సినిమాను ఫినిష్ చేయాలని ప్రేమ్ కుమార్ అనుకుంటున్నాడట.


Also Read: నీ గోడలో ఇటుక అవుతానేమో... వీరాభిమాని, 'లిటిల్ హార్ట్స్'తో హిట్ కొట్టిన మౌళి ట్వీట్‌కు నాని రిప్లై


ఫహాద్‌తో చేస్తున్న సినిమా తన గత చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుందట. కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది కామన్‌గానే ఉంటుందట. ఫహాద్ సినిమాలో ఎంత యాక్షన్ ఉన్నా కూడా ఎమోషనల్ పాయింట్ అనేది కచ్చితంగా అందరినీ టచ్ చేస్తుందని ప్రేమ్ కుమార్ చెబుతున్నాడు. మరి ఈ మూవీతో ఫహాద్, ప్రేమ్ కుమార్‌లకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.


Also Readకర్ణాటకలో పవన్ ఫ్యాన్స్ కోసం ప్లాన్ మార్చిన ఓజీ టీం... కన్నడలోనూ మూవీ రిలీజ్...‌‌‌‌‌ డబ్బింగ్ అప్డేట్ ఏమిటంటే!?



'96' కోలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్‌గా మారిందో అందరికీ తెలిసిందే. తమిళంలో వచ్చిన ఆ సినిమా సౌత్ అంతటా హాట్ టాపిక్ అయింది. ఇక తమిళ వర్షెన్‌నే తెలుగులో చాలా మంది చూసేశారు. అయినా కూడా ఆ మూవీని జాను అంటూ తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఒరిజినల్‌లో ఉన్న ఫీల్ ఈ రీమేక్‌లో మిస్ అయిందని తెలుగు ఆడియెన్స్ ఆ జాను మూవీని అంతగా పట్టించుకోలేదు. ఇక సత్యం సుందరం మూవీని తమిళంలో పెద్ద హిట్ చేశారు. కానీ తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీలు అయితే సత్యం సుందరం మూవీ ఓ అద్భుతం అని పొగిడేశారు. కానీ కమర్షియల్‌గా సత్యం సుందరం అంత గొప్ప విజయాన్ని అయితే సాధించలేదని సమాచారం. ఇక రెండు చిత్రాల్ని సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఇప్పుడు డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నాడని చెప్పాలి.