Allu Arjun's Pushpa 3 Villain?: విలన్ ఎంత పవర్ ఫుల్ అయితే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందని దర్శక రచయితలు నమ్మే సూత్రం. దర్శక ధీరుడు రాజమౌళికి ముందు, వెనుక ఎంతో మంది తీసిన సినిమాల్లో ఆ ఫార్ములా ఫాలో అయ్యారు. పూరి జగన్నాథ్ వంటి దర్శకులు 'బిజినెస్‌మేన్' వంటి సినిమాల్లో విలనిజం లేకుండా హీరోయిజం ఎలివేట్ చేశారు. ఇప్పుడు 'పుష్ప 2'లో క్రియేటివ్ జీనియస్, లెక్కల మాస్టారు సుకుమార్ కూడా అంతే! కానీ, ఈ సినిమా విడుదలైన వెంటనే సీక్వెల్ విలన్ గురించి డిస్కషన్ మొదలయ్యేలా చేశారు.
'పుష్ప 3'లో విలన్ ఎవరు? ఇద్దరిలో మెయిన్ ఎవరు?
Who is antagonist in Pushpa 3 The Rampage?: 'పుష్ప 2: ది రూల్'లో పుష్పరాజ్ రూలింగ్‌కు, అతనికి ఎదురే లేదన్నట్టు చూపించారు. 'పుష్ప 2'లో అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య బలమైన సన్నివేశాలు ఉంటాయని భావించారు. పుష్పకు భన్వర్ సింగ్ షెకావత్ గట్టి పోటీ ఇస్తాడని అనుకున్నారు. కానీ, అటువంటి సీన్లు సినిమాలో లేవు.
ఇప్పుడు ప్రేక్షకులు అందరూ మాట్లాడుతున్న గంగమ్మ జాతరలో గానీ, క్లైమాక్స్ ముందు వచ్చే కోట ఫైటులో గానీ భన్వర్ సింగ్ షెకావత్ లేరు. కానీ, హీరోయిజం ఒక రేంజ్‌లో వర్కవుట్ అయ్యింది. అసలు ఇప్పుడు 'పుష్ప 2'లో విలన్ ఎవరు? అనేది డిస్కషన్ పాయింట్ కాదు. ఆ మాటకు వస్తే... విలన్ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కానీ, 'పుష్ప 3'లో విలన్ గురించి డిస్కషన్ మొదలైంది.
'పుష్ప 2'లో దర్శకుడు సుకుమార్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త క్యారెక్టర్ ప్రతాప్ రెడ్డి. అందులో జగపతి బాబు నటించారు. ఆయన తమ్ముడిగా ఆదిత్య మీనన్, తమ్ముడి కుమారుడిగా తారక్ పొన్నప్ప నటించారు. సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు ఏమిటి? వాళ్ళు ఏం చేశారు? అనేది ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. కానీ, సినిమా చివరకు వచ్చేసరికి పుష్ప రాజ్, ప్రతాప్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉండవు. ఇద్దరి మధ్య చెడుతుంది. దాంతో 'పుష్ప 2'లో మెయిన్ విలన్ ఎవరు అవుతారు? షెకావత్తా? ప్రతాప్ రెడ్డా? అనే డిస్కషన్ మొదలైంది. లేదంటే ఇద్దరితో పాటు 'పుష్ప 2'లో చివరలో వచ్చిన జాలి రెడ్డి (డాలీ ధనుంజయ) అవుతారా? అనేది చూడాలి.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
జగపతి బాబుకు మెమరబుల్ రోల్స్ ఇచ్చిన సుక్కు
జగపతి బాబు మీద సుకుమార్ ప్రత్యేక అభిమానం చూపిస్తారు. సీనియర్ హీరో కోసం ఆయన స్పెషల్ రోల్స్ డిజైన్ చేస్తుంటారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' కావచ్చు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం' కావచ్చు... సుక్కు దర్శకత్వంలో జగపతి బాబు ఇంతకు ముందు డిఫరెంట్ విలన్ రోల్స్ చేశారు. 'పుష్ప 2'లో జగపతి బాబు స్క్రీన్ టైమ్ తక్కువ అయినా సరే ఆయన లుక్ నుంచి యాక్టింగ్ వరకు కొత్తగా ఉన్నాయి. నటుడిగా ఆయన ప్రయాణంలో ఇది మరొక మైలురాయి అనుకోవచ్చు. పార్ట్ 3లో జగపతి బాబు రోల్ ఉండబోతుందో? మనం వెయిట్ చేయాల్సిందే.
Also Read: ‘పుష్ప 2’ జాతర ఎపిసోడ్‌కు సౌదీ అరేబియా సెన్సార్ - కర్ణాటకలోనూ కోలుకోలేని షాక్... విషయం ఏమిటంటే?