Aavesham Welcome Teaser Out: మలయాళ స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'ఆవేశం. ఈ చిత్రం రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఫాహాద్‌ కొద్ది రోజులుగా 'ఆవేశం' మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మలయాళంలో జిత్తు మాధవన్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్‌ 11న విడుదల కాబోతుంది. ఇక మూవీ రిలీజ్‌కు ఒక్క రోజు ఉందనగా తాజాగా మేకర్స్‌ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. ఈ వీడియో ఫాహద్‌ టవల్‌పై డ్యాన్స్‌ చేస్తూ ఫుల్‌ జోష్‌లో కనిపించాడు. దీనిని వెల్‌కమ్‌ టీజర్‌ అంటూ ఎలక్ట్రిక్‌ స్నీక్‌ పీక్‌ అంటూ వీడియో వదిలారు. ప్రస్తుతం ఈ వెల్‌కమ్‌ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.


'పుష్ప 2'లో తన పాత్రపై ఆసక్తికర కామెంట్స్


కాగా మలయాళం అగ్ర నటుడైన ఫాహద్‌ ఫాజిల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు డబ్బింగ్‌ చిత్రాలతో ఆయన తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితమే. ఇక పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు మరింత దగ్గరయ్యారు. ఈ చిత్రంలో ఫాహద్‌కు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌లో కనిపించింది కొద్ది సేపు అయినా బన్వర్ సింగ్ షికావత్‌గా 'పుష్పరాజ్‌'ను డామినేట్‌ చేశాడు. కొన్ని క్షణాల పాటు పుష్పరాజ్‌కు చుక్కలు చూపించాడు. దీంతో సెకండ్ పార్ట్‌లో బన్వర్ సింగ్‌ రోల్‌పై అందరి ఆసక్తి నెలకొంది. పుష్పరాజ్‌కు బన్వర్‌ సింగ్‌కు మధ్య హోరాహోరి పోరు ఉండనుందని అర్థమైపోయినా, ఆయన క్యారెక్టర్‌ రైషన్‌ ఎలా ఉండబోంతుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.


ఈ క్రమంలో తాజాగా తన కొత్త సినిమా ఆవేశం ప్రమోషన్స్‌లో తన రోల్‌పై ఎలా ఉండబోతుంది చెప్పి మరింత హైప్‌ పెంచారు. 'పుష్ప 2' తన పాత్ర క్రూరంగా ఉంటుందా? భయంకరంగా ఉంటుందనే చెప్పలేను.. కానీ, చాలా కొత్త ఉంటుందని చెప్పారు. కాగా 'పుష్ప 2' మూవీ ఆగస్ట్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనసూయ భరద్వాజ్‌, సునీల్‌, జగపతి బాబు వంటి స్టార్‌ యాక్టర్స్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక పుష్ప 2 విడుదలకు ముందే భారీగా మార్కెట్‌ చేస్తుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని భారీ డీల్‌కు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఈ మూవీ మ్యూజికల్‌ రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్‌ దక్కించుకుంది.







ఎస్ఎస్ కార్తీకేయతో రెండు సినిమాలు


వరల్డ్‌ వైడ్‌ ఆడియో రైట్స్‌తో పాటు హిందీ శాటిలైట్‌ హక్కులను కూడా టీ-సిరీస్‌ దక్కించుకుందని సమాచారం. దాదాపు రూ. 65 కోట్ల కోనుగోలు చేసిందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక ఫాహాద్‌ నెక్ట్స్‌ సినిమాల విషయానికి వస్తే.. 'పుష్ప 2', 'ఆవేశం'తో పాటు ఫాహద్‌ మరిన్ని సినిమాలను లైనప్‌ చేసుకున్నారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ నిర్మాణంలో రెండు సినిమాలు ప్రకటించారు. అవి ఆక్సిజన్‌, డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ చిత్రాలు. ఆక్సిజన్‌ను చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వం వహిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇక డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌కి శశాంక్ యాలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా కాల భ‌ర‌వ సంగీత దర్శకుడి వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి.