Hebah Patel's Horror Thriller Eesha Trailer Out Now : టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ భయపెట్టేయగా... తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మరింత భయపెడుతోంది. 

Continues below advertisement

మరో చీకటి ప్రపంచం

ఆత్మలు, దెయ్యాలు ప్రధానాంశంగా 'ఈషా' మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. శ్మశానంలో ఓ యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సీన్‌తో దెయ్యం ఎంట్రీ ఇవ్వగా... 'మీకు తెలియని... మీరు ఊహించడానికే భయమేసే చీకటి ప్రపంచం ఇంకొకటి ఉంది.' అనే డైలాగ్‌తో హైప్ క్రియేట్ అవుతోంది. ఓ విలేజ్‌లో మిస్టీరియస్ హౌస్‌లో ఉండే దెయ్యాలు, వాటి నుంచి ఆ గ్రామస్థులకు ఎదురయ్యే అనుభవాలను చూపించారు.

Continues below advertisement

నలుగురు స్నేహితులు విలేజ్‌లోని హాంటెడ్ హౌస్‌లో మిస్టరీని ఛేదించేందుకు వెళ్లగా వారికి ఎదురైన ఎక్స్‌పీరియన్స్, ఆత్మల నుంచి వారు ఎలా బయటపడ్డారు? అనేదే మూవీ అని తెలుస్తోంది. గ్లింప్స్‌తో నార్మల్‌గా భయపెట్టగా ట్రైలర్‌‌తో మరింత భయపెట్టేశారు. హార్ట్ పేషెంట్స్ ఈ మూవీ చూడకపోవడమే మంచిదంటూ నిర్మాత బన్నీ వాస్ చెప్పడం మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మూవీలో హెబ్బా పటేల్‌తో పాటు అఖిల్ రాజ్, త్రిగుణ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించగా... హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. 'మీరు ఊహించడానికే భయమేసే చీకటి ప్రపంచం మరొకటి ఉంది', 'కళ్లు మూసుకున్నంత మాత్రాన గతం మాయమవదు' అనే డైలాగ్స్ భయపెడుతున్నాయి.