Eesari Pandaga Manadhe Latest Promo : ఓ పండగ వస్తుందంటే బుల్లితెరపై ఉన్న టీవీ చానల్స్ అలర్ట్ అవుతాయి. కచ్చితంగా ఆ పండుగ రోజు స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతుంటాయి. అలా ప్రతి పండక్కి కొన్ని టీవీ చానల్స్ స్టార్ సెలబ్రిటీస్ తో కలిసి స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తూ ఉంటాయి. మరో నాలుగు రోజుల్లో ఉగాది పండుగ రాబోతోంది. ఈ సందర్భంగా ఈటీవీ 'ఈసారి పండగ మనదే' అంటూ స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కు సంబంధించి ఒ ప్రోమోని రిలీజ్ తాజాగా మరో ప్రోమోని వదిలి ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు.
ఉగాది ఈవెంట్ లో 'బలగం' తాత సందడి
తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో 'బలగం' తాత కొమురయ్య ఎంట్రీ ఇచ్చారు." జీవితం ఒక అద్భుత నాట్యం, జీవులంతా నర్తకులు" అనే డైలాగ్ తో ఆకట్టుకున్నారు. కాగా 'బలగం' సినిమాలో కొమురయ్య పాత్రలో అద్భుత నటన కనబరిచిన ఈయన ఇలా ఈటీవీ ఉగాది స్పెషల్ ఈవెంట్ లో కనిపించడంతో బుల్లితెర ఆడియన్స్ ఫుల్ ఈవెంట్ టెలికాస్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విజయ్ దేవరకొండ, దిల్ రాజు డైలాగ్స్ తో అదరగొట్టిన రియాజ్
ఉగాది ఈవెంట్ లో భాగంగా తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో రోహిణి, రియాజ్ కలిసి ఓ స్కిట్ చేశారు. ఈ స్కిట్లో రియాజ్ తన పర్ఫామెన్స్ అదరగొట్టేసాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫేమస్ డైలాగ్ 'ఐరనే వంచాలా ఏంటి?', దిల్ రాజు ఫేమస్ డైలాగ్ 'డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుక్కు' వంటి డైలాగ్స్ తో స్కిట్ చేసి అలరించాడు. ఆ స్కిట్ చూసి విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్, దిల్ రాజు తెగ నవ్వుకున్నారు.
సుధీర్ మాస్ పెర్ఫార్మన్స్
సుడిగాలి సుదీర్ ఈటీవీ స్పెషల్ ఈవెంట్ లో కనిపించాడంటే కచ్చితంగా ఆ ఈవెంట్లో అతని నుంచి ఓ స్పెషల్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సుధీర్ స్పెషల్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసాడు. ఈసారి మాస్ పర్ఫామెన్స్ తో దుమ్ము లేపాడు. మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలోని కూర్చి మడతపెట్టి సాంగ్ కి ఊర మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. సుధీర్ మాస్ స్టెప్స్ కి స్టేజ్ అంతా దద్దరిల్లిపోయింది. చూస్తుంటే ఈవెంట్ లో సుధీర్ మాస్ పర్ఫామెన్స్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు తాజాగా విడుదలైన ప్రోమోని చూసిన సుధీర్ ఫ్యాన్స్ ఆయన మాస్ పర్ఫామెన్స్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్లో 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీం తోపాటు 90's వెబ్ సిరీస్ టీం 'బలగం' టీం సందడి చేశారు. ఉగాది పండుగ రోజు మార్చి 9న ఈ ఈవెంట్ ఉదయం 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.
Also Read : ఓటీటీకి వచ్చేసిన తెలుగు హార్రర్ థ్రిల్లర్ 'తంత్ర' - అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్, ఎక్కడంటే!