దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తీసిన సినిమాలలో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంటుంది. సౌత్ ఇండియన్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేసిన ఘనత ఆ సినిమాకు దక్కుతుంది. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా అయితే ఆస్కార్ వరకు వెళ్ళింది. రాజమౌళి బెస్ట్ సినిమాలలో ఆ రెండిటికీ చోటు ఉంటుంది. ముందు వరుసలో వినిపించే సినిమాలలో ఆ రెండిటి పేర్లు ఉంటాయి అయితే రాజమౌళి తన బెస్ట్ సినిమా అని ఏ సినిమా పేరు చెప్పారో తెలుసా?

ఈగ... నా బెస్ట్ సినిమా: రాజమౌళి!ప్రముఖ పారిశ్రామికవేత్త కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'జూనియర్' (Junior Movie). ఈ శుక్రవారం (జూలై 18న) థియేటర్లలోకి వస్తుంది.‌ ఇందులో శ్రీ లీల హీరోయిన్. జెనీలియా ఒక కీలక పాత్ర చేశారు. జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి నిర్వహించారు. దానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పుడు స్క్రీన్ మీద రాజమౌళి ప్రీవియస్ సినిమాల వర్కింగ్ స్టిల్స్ వేసి ఏం గుర్తొస్తుందో అడిగారు యాంకర్ సుమ. 

'ఈగ' సినిమా వర్కింగ్ స్టిల్ వచ్చినప్పుడు రాజమౌళి తన బెస్ట్ మూవీ అని చెప్పారు. 'బాహుబలి'కి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ కావడానికి ఒక విధంగా 'ఈగ' కారణం అని చెప్పాలి. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆ సినిమా డబ్బింగ్ చేసి విడుదల చేశారు.‌ విమర్శకులతో పాటు కొంత మంది ప్రేక్షకులను అమితంగా ఆ సినిమా ఆకట్టుకుంది. 'బాహుబలి' విడుదల చేసే సమయానికి రాజమౌళి ఎవరో ఇతర భాషల ప్రేక్షకులకు కూడా తెలుసు. హీరో ఎవరూ లేకుండా 'ఈగ'ను ప్రధాన పాత్రలో చూపించే సినిమా తీయడం కూడా ఛాలెంజ్. అందుకని తన బెస్ట్ సినిమా 'ఈగ' అని చెప్పి ఉండవచ్చు.

Also Read: రాజమౌళి రూటులో ప్రశాంత్ నీల్, సుకుమార్ నడుస్తారా? కేజీఎఫ్, పుష్ప, ఎన్టీఆర్ బయోపిక్‌లను ఒక్క సినిమాగా మళ్ళీ థియేటర్లలోకి చూడగలమా?

రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా విషయానికి వస్తే...‌‌ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా పాన్ వరల్డ్ మూవీ (SSMB29) చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు బాహుబలి రెండు భాగాలను ఒక్కటి చేసి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న విడుదల చేయడానికి రాజమౌళి కృషి చేస్తున్నారు. ఆ సినిమా ఎడిటింగ్ పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు.

Also Reaబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?