మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్' (Eagle Movie). టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. యంగ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ చేస్తున్నారు. తెలుగు చిత్రసీమలో వరుస సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మిస్తున్న చిత్రమిది. రవితేజది ఆ సంస్థకు మంచి అనుబంధం ఉంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్ 'ధమాకా' చేసింది.
బ్లాక్ బస్టర్ 'ధమాకా' తర్వాత రవితేజ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడంతో 'ఈగల్' (Eagle Telugu Movie) మీద మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో జనవరి 13న ఈ సినిమాను విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు.
రవితేజ పుట్టినరోజుకా? సంక్రాంతికా?
సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం', విక్టరీ వెంకటేష్ 75వ సినిమా 'సైంధవ్', 'ది' విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్', తేజా సజ్జా 'హను మాన్' సినిమాలు ఉండటంతో 'ఈగల్'ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ ఖబర్. రవితేజ బర్త్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే... అటువంటిది ఏమీ లేదని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read : సంక్రాంతి బరిలో మహేష్ సినిమాకు ప్రయారిటీ... నేనెందుకు వేరే నిర్మాతలను అడగాలి? - నిర్మాత నాగవంశీ
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఈగల్' సినిమా కోసం ఇప్పటి నుంచి థియేటర్ యాజమాన్యాలతో అగ్రిమెంట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా సరే సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారట. విజయ దశమికి వచ్చిన 'టైగర్ నాగేశ్వర రావు'కు థియేటర్ల విషయంలో అన్యాయం జరిగిందనే అభిప్రాయం రవితేజ అభిమానులలో వ్యక్తం అవుతోంది. సంక్రాంతికి అన్ని సినిమాలతో పోటీ అంటే ఎక్కువ థియేటర్లు రావడం కష్టమే అనే టాక్ ఒక వైపు... ఆల్రెడీ అగ్రిమెంట్లు చేస్తున్న విషయం మరోవైపు... మొత్తం మీద సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
'ఈగల్' సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తున్నారు. ఆమె మొదటి కథానాయికగా నటిస్తుండగా... 'ఏక్ మినీ కథ' ఫేమ్ కావ్య థాపర్ (Kavya Thapar) మరో కథానాయికగా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధు బాల ఇతర ముఖ్య తారాగణం.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : సుజిత్ కుమార్ కొల్లి, ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీనాగేంద్ర తంగాల, స్టైలిస్ట్ : రేఖ బొగ్గరపు, కూర్పు : కార్తీక్ ఘట్టమనేని, మాటలు : మణిబాబు కరణం, స్క్రీన్ ప్లే : కార్తీక్ ఘట్టమనేని - మణిబాబు కరణం, పాటలు : చైతన్య ప్రసాద్, రెహమాన్ & కళ్యాణ్ చక్రవర్తి, యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ & టోమెక్, సంగీతం : దవ్‌జాంద్ (Davzand), నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్, రచన & దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని.