Shash Rukh Khan's Dunki Trailer At Burj Khalifa : బాలీవుడ్ లో ఈ ఏడాది పఠాన్, జవాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డంకీ'. రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే బాలీవుడ్ లో భారీ అంచనాల నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడటంతో ఇప్పటికే మూవీ టీం సాంగ్స్ తో పాటు ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ ప్రమోషనల్ కంటెంట్ కి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న షారుఖ్ ఖాన్ డంకీ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.
రిలీజ్ కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ‘డంకీ’ క్రేజ్ తాజాగా దుబాయ్ వరకు చేరింది ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం షారుక్ తాజాగా దుబాయ్ చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడి కొన్ని ప్రత్యేక ప్రాంతాలను సందర్శిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు షారుక్. ఈ క్రమంలోనే దుబాయ్ లోని బుర్జ్ కలీఫా పై 'డంకీ' ట్రైలర్ వెలుగు చూడడం ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ‘డంకీ’ సినిమాపై ఉన్న క్రేజ్ ని తారా స్థాయికి చేర్చేందుకు షారుక్ స్వయంగా తన సినిమాని ప్రమోట్ చేసేందుకు బుర్జ్ కలీఫా కి చేరుకున్నాడు. ఎప్పటిలాగే తన సినిమాల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ‘డంకీ’ ట్రైలర్ ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు.
దాంతోపాటు 'లుట్ ఫుట్ గయా, ఓ మహి సాంగ్స్ కి తనదైన స్టైల్ లో డాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం ట్రైలర్ ని ప్రదర్శించడం మాత్రమే కాకుండా ఇదే బుర్జ్ ఖలీఫాపై డ్రోన్ షోను కూడా ప్రదర్శించారు. దాన్ని చూసిన అక్కడి అభిమానులు మంత్రముగ్ధులు అయిపోయారు. ఆ డ్రోన్ షోలో షారుక్ ఐకానిక్ పోజ్ డిస్ప్లే అవ్వగా షారుక్ సేమ్ అదే పోజ్ ని అనుకరిస్తూ కనిపించారు. అది చూసిన అభిమానులు అరుపులు, కేకలతో నానా హంగామా చేశారు.
కాగా దుబాయ్ ప్రమోషన్స్ లో భాగంగా డెయిరా సిటీ సెంటర్‌ను సందర్శించారు షారుక్. అక్కడ వి.ఓ.ఎక్స్ సినిమాస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కింగ్ ఖాన్‌ని చూసిన ఫ్యాన్స్ తెగ హంగామా చేశారు. షారుక్ కి అద్భుతమైన స్వాగతాన్ని పలికారు. ఈవెంట్‌కి వచ్చిన ఆడియన్స్ నినాదాలతో ఆడిటోరియం మారుమోగింది. ఇక డంకీ విషయానికొస్తే.. ఈ సినిమాలో షారుక్ సరసన తాప్సి హీరోయిన్‌గా నటిస్తోంది. బోమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, సునీల్ గ్రోవర్ కీలక పాత్రను పోషిస్తున్నారు జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ నిర్మిస్తున్నారు.
Also Read : భాస్ ఫ్యాన్స్ ఆగ్రహం, డైరెక్టర్ వెంకటేష్ మహా ట్విట్టర్ ఖాతా డియాక్టివేట్?