Dulquer Salmaan Lucky Bhaskar: 'సీతారామం' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న తెలుగు స్ట్రయిట్‌ మూవీ 'లక్కీ భాస్కర్‌'. దుల్కర్‌ సల్మాన్‌ లీడ్‌ రోల్లో టాలీవుడ్‌ టాలంటెడ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్‌తోనే హైప్‌ క్రియేట్‌ అయ్యింది. పైగా పాన్‌ ఇండియాగా  'లక్కీ భాస్కర్‌' రూపొందనుంది. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అయిన దుల్కర్‌ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడనేది ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చి చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ కానీ, పోస్టర్‌ కానీ బయటకు రాలేదు.


రేపే ఫస్ట్‌లుక్‌


దీంతో మూవీ అప్‌డేట్‌ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. లక్కీ భాస్కర్‌ ఫస్ట్‌లుక్‌ను రేపు లాంచ్‌ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటన  ఇచ్చింది మూవీ టీం. ఫిబ్రవరి 3న సాయంత్ర 4:41 గంటలకు లక్కీ భాస్కర్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయబోతున్నారట. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ మూవీపై, నయ అప్‌డేట్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ నయా పోస్టర్‌ చూస్తుంటే ఇందులో దుల్కర్‌ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. డబ్బు చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉండబోతోంది. సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ చేస్తున్న రెండవ స్ట్రయిట్ తెలుగు ఫిలిం ఇది.






దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ తాజా అప్ డేట్ చూసి దుల్కర్‌  ఫ్యాన్స్‌, సినీ ప్రియులంతా అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ కోసం ఈగర్‌గా ఉన్నామని, రేపు సాయంత్రం వరకు వేయిట్‌ చేయలేకపోతున్నామంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌తో జతగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణ ప్రయాణం కొలవలేని ఎత్తులకు, ఉన్నత శిఖరాలకు చేరిన వైనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నామని దర్శకుడు వెంకీ మూవీ ప్రారంభోత్సవంలో చెప్పారు.


Also Read: అరుదైన వ్యాధి బారిన నటి పూనమ్‌ కౌర్‌ - రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు, బాడీలో మూమెంట్స్‌ కూడా లేవు..


ఇదిలా ఉంటే లక్కీ భాస్కర్‌ను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా వచ్చిన 'సార్‌' మూవీకి కూడా జీవీ ప్రకాషే సంగీతం అందించాడు. ఈ మూవీ మ్యూజిక్‌ పరంగా ఎంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు లక్కీ భాస్కర్‌గా కూడా జీవీ ప్రకాష్‌ స్వరాలు సమకూర్చడం మూవీకి మరింత ప్లస్‌ అంటున్నారు ఆడియన్స్. సార్‌ తరహా లక్కీ భాస్కర్‌ కూడా మ్యూజిక్‌ పరంగా సూపర్‌ హిట్‌ అవుతుందంటూ అభిప్రాయపడుతున్నారు.