తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తమిళ - తెలుగు చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా నిలిచిన ప్రముఖ అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ (Dubbing Writer Sree Ramakrishna) ఇక లేరు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీ రామకృష్ణ ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం రాత్రి 8 గంటలకు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.
చెన్నైలో ఈ రోజు అంత్యక్రియలుశ్రీ రామకృష్ణ సోమవారం రాత్రి చెన్నైలోని తేనాపేటలోని అపోలో ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆయన స్వస్థలం ఏపీలోని తెనాలి. అయితే, యాభై ఏళ్ల క్రితం తమిళనాడు వెళ్లారు. చెన్నైలో స్థిరపడ్డారు. తమిళ చిత్రాలు ఎన్నిటికో తెలుగులో అద్భుతమైన సంభాషణలు అందించారు. రచయితగా పేరు తెచ్చుకున్నారు.
Writer Sree Ramakrishna Family Details: శ్రీ రామకృష్ణ ఓ భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన సతీమణి పేరు స్వాతి. కుమారుడి పేరు గౌతమ్. ఈ రోజు ఆయన పార్థివ దేహానికి చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో గల శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు, అంత్యక్రియలు జరుగుతాయని కుమారుడు తెలిపారు.
మూడు వందలకు పైగా సినిమాలు...మణిరత్నం, శంకర్ వంటి దర్శకులకు!Writer Sree Ramakrishna Hit Movies: మూడు వందలకు పైగా డబ్బింగ్ సినిమాలకు మాటలు రాసిన ఘనత శ్రీ రామకృష్ణది. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన మణిరత్నం, శంకర్ వంటి దర్శకులతో ఆయన ఎక్కువ పని చేశారు.
Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...
మణిరత్నం తీసిన 'బొంబాయి', శంకర్ 'జెంటిల్‌మన్', 'ఒకే ఒక్కడు', సూపర్ స్టార్ రజనీకాంత్ 'చంద్రముఖి' సినిమాల్లో శ్రీ రామకృష్ణ సంభాషణలకు మంచి పేరు వచ్చింది. ఆ దర్శకులు ఇద్దరూ చేసిన అన్ని చిత్రాలకూ ఆయనే మాటలు రాశారు. రజనీకి ప్రముఖ గాయకుడు, తెలుగులో ఆయన సినిమాలకు డబ్బింగ్ చెప్పే మనోను పరిచయం చేసింది శ్రీ రామకృష్ణే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'దర్బార్' ఆయన చివరి సినిమా. ఆయన మాటలు రాసిన లాస్ట్ సినిమా అదే.
రచయితే కాదు... దర్శకులు కూడా!Two movies directed by writer Sree Ramakrishna: శ్రీ రామకృష్ణలో రచయిత మాత్రమే కాదు... ఓ దర్శకుడు ఉన్నారు. 'బాల మురళీ ఎంఏ', 'సమాజంలో స్త్రీ' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. శ్రీ రామకృష్ణ మరణం పట్ల పలువురు చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.