ప్రజెంట్ ప్రతి ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్ (సినిమాల)ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అందులో 'ద్రౌపతి - 2' ఒకటి. రిచర్డ్ రిషి కథానాయకుడిగా దర్శకుడు మోహన్ జి 'ద్రౌపతి' (2020) తీశారు. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో తీస్తున్న రెండో చిత్రమిది.

'ద్రౌపతి 2' ఫస్ట్ లుక్ విడుదల!Draupathi 2 First Look Poster: 'ద్రౌపతి 2'లో రిచ‌ర్డ్ రిషి, ర‌క్ష‌ణ ఇందుసుద‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నట్టి నటరాజ్ కీలక పాత్రధారి. చోళ చక్రవర్తికి చెందిన నేతాజీ ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పొరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. 'ప‌ళయ వ‌న్నార‌పేట్టై', 'ద్రౌప‌తి', 'రుద్ర తాండ‌వం', 'బ‌కాసుర‌న్' సినిమాల తర్వాత మోహ‌న్‌ జి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

వినాయక చవితి సందర్భంగా 'ద్రౌపతి 2' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వీరసింహ కడవ రాయులు పాత్రలో నటిస్తున్న రిచర్డ్ రిషి లుక్ విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు రిచర్డ్ రిషి తెలుసు. హీరోయిన్ షాలిని తమ్ముడు అతను. అంటే అజిత్ బావమరిది అన్నమాట. తెలుగులో 'ఏ ఫిల్మ్ బై అరవింద్' సినిమా చేశారు. ఇప్పుడు తమిళ సినిమాల్లో ఎక్కువ నటిస్తున్నారు.

మొఘల్ vs హోయసాల...'ద్రౌపతి 2' కథ ఏమిటంటే!?'ద్రౌపతి 2' సినిమా 14వ శ‌తాబ్దానికి చెందిన క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. దక్షిణ భారతదేశంలోకి మొఘల్ చక్రవర్తుల అడుగు పెట్టిన నేపథ్యంలో కథ, కథనం ఉంటాయని తెలిసింది. హోయసాల సామ్రాజ్య చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజుగా రిచర్డ్ రిషి నటిస్తున్నారు. మొఘల్ చక్రవర్తులతో ఆయన ఎలా పోరాడారు? ఏమైంది? అనేది సినిమా.

Also Readసుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?

'ద్రౌపతి 2' సినిమా కథకు, 2020లో విడుదలైన 'ద్రౌపతి' కథకు కనెక్షన్ ఏమిటి? ఈ రెండు కథలు ఎలా కలుస్తాయి? అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ ఏడాది ఆఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముంబైలో 75 శాతం చిత్రీకరణ చేయడంతో పాటు మిగతా భాగాన్ని సెంజి, తిరువ‌ణ్ణామ‌లై, కేర‌ళ‌ల‌లో షూటింగ్ చేయనున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

రిచర్డ్ రిషి, ర‌క్ష‌ణ ఇందుసుద‌న్ జంటగా... నట్టి నటరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న 'ద్రౌపతి 2'లో వైజి మ‌హేంద్ర‌న్‌, 'నాడోడిగ‌ల్' భ‌ర‌ణి, శ‌ర‌వ‌ణ సుబ్బ‌య్య‌, వేల్ రామ‌మూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గ‌ణేష్ గౌరంగ్, దివి, దేవ‌యాని శ‌ర్మ‌, అరుణోద‌య‌న్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: మోహ‌న్‌ జి - ప‌ద్మ చంద్ర‌శేఖ‌ర్, సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: ఫిలిప్ ఆర్‌.సుంద‌ర్, నృత్య దర్శకత్వం: థ‌నికా, యాక్ష‌న్: సంతోష్, కూర్పు: దేవ‌రాజ్‌, కళా దర్శకుడు: క‌మ‌ల‌నాథ‌న్.

Also Readఓటీటీలో 'కింగ్‌డమ్' స్ట్రీమింగ్ షురూ... తెలుగుతో పాటు ఆ నాలుగు భాషల్లోనూ విజయ్ దేవరకొండ సినిమా