'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా...' పాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు గూస్ బంప్స్ మూమెంట్ అందించారు సంగీత దర్శకుడు తమన్. 'ఓజీ' సినిమా (OG Movie)లో మ్యూజిక్ అదిరిపోయిందని ముందు నుంచి ఆయన చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సాంగ్స్ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'ఫైర్ స్ట్రోమ్...' సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండో పాట వచ్చేసింది.
సువ్వి సువ్వి... ఎమోషనల్ సాంగ్!OG Second Song Suvvi Suvvi Video: 'ఓజీ' సినిమాలో మొదటి పాట హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంటే... రెండో పాట 'సువ్వి సువ్వి' ఎమోషనల్ ఫీల్ గుడ్ సాంగ్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్... హీరో హీరోయిన్ల మీద తీసిన ఈ పాటలో కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సాంగ్ చూస్తే... స్టోరీ బ్యాక్ డ్రాప్ 90స్ అని అర్థం అవుతోంది. తమన్ మంచి ఎమోషనల్ ట్యూన్ ఇచ్చారు.
'సువ్వి సువ్వి' పాటలో పవన్ ప్రియాంక జోడి బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందని అర్థం అవుతోంది. ముఖ్యంగా ఈ పాటలో పవన్ స్మైల్ అదిరింది. థియేటర్లలో ఈ సాంగ్ విజువల్స్ మరింత బావుంటాయని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. విడుదలైన కొన్ని క్షణాలలో ఈ పాట చార్ట్ బస్టర్ అయింది. కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటను శృతి రంజని పాడారు. మంచి మెలోడీకి ఆమె గాత్రం తోడు కావడంతో ఇన్‌స్టంట్ హిట్ అయ్యింది సాంగ్.
Also Read: సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 25న థియేటర్లలోకి ఓజీ!OG Release Date: 'ఓజీ' సినిమా రిలీజ్ మీద వస్తున్న పుకార్లకు పవన్ కళ్యాణ్ టీం కొన్ని రోజుల క్రితం చెక్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 25న సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేసింది. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిపింది.
అమెరికాలో సెప్టెంబర్ 24న 'ఓజీ' ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఆగస్టు 29 నుంచి అడ్వాన్స్ సేల్స్, టికెట్స్ బుకింగ్ స్టార్ట్ చేయనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద ప్రముఖ నిర్మాత డివివి దానయ్యతో పాటు ఆయన తనయుడు దాసరి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకుడు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్ ఇతర ప్రధాన తారాగణం.
Also Read: ఓటీటీలో 'కింగ్‌డమ్' స్ట్రీమింగ్ షురూ... తెలుగుతో పాటు ఆ నాలుగు భాషల్లోనూ విజయ్ దేవరకొండ సినిమా