ఫ్రాంచైజ్ సినిమాల్లో ఒక హీరోను చూసిన ప్రేక్షకులు.. అదే ప్లేస్‌లో మరో హీరోను ఊహించుకోలేరు. ఎంత పెద్ద స్టార్.. ఆ ప్లేస్‌ను రీప్లేస్ చేసినా.. ఆడియన్స్ మాత్రం ముందు ఉన్న హీరోనే కోరుకుంటారు. ప్రస్తుతం ‘డాన్ 3’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘డాన్’ ఫ్రాంచైజ్‌లో రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండిటిలో షారుఖ్ ఖానే హీరోగా నటించారు. కానీ మూడో భాగానికి వచ్చేసరికి హీరో మారాడని టాక్ వినిపిస్తోంది. తాజాగా ‘డాన్ 3’కు సంబంధించిన టీజర్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ వీడియోకు ఉన్న కామెంట్స్ సెక్షన్ మొత్తం షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆగ్రహంతోనే నిండిపోయింది. తమకు ‘డాన్’ ఫ్రాంచైజ్‌లో షారుఖ్ ఖానే కావాలని, ఇంకే హీరో వద్దని ఫైర్ అయ్యారు.
ముందే హింట్ ఇచ్చాడు..
షారుఖ్ ఖాన్ కెరీర్ మొదటి నుంచి ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశారు. అందులో ఫ్యాన్స్‌కు స్పెషల్ ఫీస్ట్ ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ‘డాన్’ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. మల్టీ టాలెంటెడ్ ఫర్హాన్ అక్తార్.. కొన్నాళ్లు తన యాక్టింగ్‌ను పక్కన పెట్టి ‘డాన్’ కోసం మైక్రోఫోన్ పట్టుకున్నాడు. అయితే ‘డాన్’ హిట్ అయిన లెవెల్‌లో ‘డాన్ 2’ హిట్ అవ్వలేదు. రెండు సినిమాలకు ఒకేవిధంగా కలెక్షన్స్ వచ్చినా ‘డాన్’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ‘డాన్ 2’ క్రియేట్ చేయలేదని అప్పట్లో కొందరు ప్రేక్షకులు విమర్శించారు. అయితే ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడం కోసం ‘డాన్ 3’తో మళ్లీ మీ ముందుకు వస్తానని ఫర్హాన్ మాటిచ్చాడు. కానీ ‘డాన్ 3’లో మాత్రం హీరో షారుఖ్ కాదని ముందు నుంచి హింట్ ఇస్తూనే ఉన్నాడు.
‘డాన్ 3’ అనౌన్స్‌మెంట్ వీడియో అదుర్స్..
తాజాగా ఫర్హాన్ అక్తర్ తన సోషల్ మీడియా ద్వారా ‘డాన్ 3’ అనౌన్స్‌మెంట్ టీజర్ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో కింద ఫర్హాన్ క్యాప్షన్ ఏం పెట్టలేదు. వీడియోలోనే ప్రేక్షకులకు కావాల్సిన సమాచారాన్ని అందించాడు. అందులో స్క్రీన్ మధ్యలో ఉన్న 3 అని ఉండే నెంబర్‌పై స్పాట్‌లైట్ పడేలా చేసింది. ఆ ఫాంట్, ఆ స్టైల్ చూస్తుంటే ప్రేక్షకులకు చాలా తెలిసినట్టుగా అనిపిస్తుంది. అంతే కాకుండా ‘మై హూ డాన్’ అనే ఫేమస్ పాటకు సంబంధించిన మ్యూజిక్.. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఈ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేయగానే.. కామెంట్స్ సెక్షన్ మొత్తం నిండిపోయింది. ఐఎమ్‌డీబీకి చెందిన అఫీషియల్ పేజ్ ఈ వీడియోకు తన కామెంట్‌ను తెలిపింది. ‘11 రాష్ట్రాల పోలీసులు రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని సరదాగా కామెంట్ చేసింది.
రణవీర్ హీరో అంటూ టాక్..
‘డాన్ 3’ అనౌన్స్‌మెంట్ వీడియోలో ప్రేక్షకులు దృష్టిని ఆకట్టుకున్న మరో అంశం.. ‘ఎ న్యూ ఎరా బిగిన్స్’ అనే లైన్. అది చూసిన వెంటనే ఫ్యాన్స్‌లో అయోమయం మొదలయ్యింది. ఈ థ్రీక్వెల్‌లో షారుఖ్ ఖాన్ నటించడేమో అని వారే డిసైడ్ అయిపోయారు. అంతే కాకుండా షారుఖ్ స్థానాన్ని రణవీర్ తీసుకోనున్నాడు అనే వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవ్వడంతో షారుఖ్ ఫ్యాన్స్‌లో కలవరం మొదలయ్యింది. షారుఖ్ స్వాగ్ ఎవరికీ రాదని, అసలు షారుఖ్ లేకపోతే ‘డాన్’ అనే ఫ్రాంచైజ్ వ్యర్థం అని ఫ్యాన్స్ అంతా కామెంట్స్ సెక్షన్‌లో విరుచుకుపడ్డారు. ఈ నెగిటివిటీపై మూవీ టీమ్ ఇంకా స్పందించాల్సి ఉంది.
Also Read: ‘ఖుషి’ రికార్డ్‌ను బ్రేక్ చేసిన మహేష్ - రీ రిలీజ్‌లో 'బిజినెస్ మెన్' ఆల్ టైమ్ రికార్డ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial