దక్షిణ భారతదేశంలో భక్త కన్నప్ప కథ తెలియని వారు ఎవరూ ఉండరు. శివుడి కంటి బాధ ఆర్పడం కోసం తన రెండు కళ్ళు పెగిలించి ఇచ్చిన వీరభక్తుడిగా కన్నప్ప పేరు పురాణాల్లో నిలిచిపోయింది. శివ పురాణంలోనూ... శ్రీకాళహస్తీశ్వర స్థలపురాణంలోనూ 'కన్నప్ప' కథకు ప్రముఖ స్థానం లభించింది. అయితే కన్నప్ప జన్మస్థానం ఇదే అంటూ అన్నమయ్య జిల్లాలోని 'ఊటుకూరు' అనే గ్రామం ఈ మధ్య పాపులర్ అవుతోంది. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా!
ఊటుకూరులో అతి పురాతన శివాలయం'కన్నప్ప' స్థాపించిన ఆలయం అంటున్న భక్తులుస్థానిక కథనం ప్రకారం కన్నప్ప అసలు పేరు తిన్నడు. గిరిజన తెగ నాయకుడు అయిన నాగుడు అతని భార్య తందెల కుమారుడు. వారు కడప సమీపంలోని రాజంపేట దగ్గర్లో ఊటుకూరులో నివసిస్తూ ఉండేవారు. అప్పట్లో అదంతా మహారణ్యం. మొదట్లో నాస్తికుడిగా ఉండే తిన్నడు తరువాతి కాలంలో మహా శివ భక్తుడిగా మారాడు. ఆయన స్థాపించి పూజలు చేసాడని చెప్తున్న శివలింగం ప్రస్తుతం ఊటుకూరు శివాలయంలో ఉంది. అనంతరం తిన్నడు శ్రీ కాళహస్తిలో శివునికి పూజలు జరుపుతుండగా... అతడి భక్తిని పరీక్షించడానికి శివుడు తన శివలింగంలోని కంటి నుండి నీరు కారేలా చేయడం తిన్నడు దానికి పసరు పూయగా రక్తం కారడంతో కంటికి తన కన్నే మందు అంటూ తిన్నడు తన కళ్ళను తీసి శివుడికి అర్పించడం అందరికీ తెలిసిన కథే. అతడి భక్తికి మెచ్చిన శివుడు, తిన్నడుకు దర్శనం ఇచ్చి తిరిగి కళ్ళను ఇవ్వడం... ఆపై మోక్షం ఇవ్వడం శివ పురాణంలో ఉన్న కథ. అప్పటి నుండీ తిన్నడు పేరు 'కన్నప్ప'గా మారిపోయింది. అయితే ఇదంతా శ్రీ కాళహస్తి గుడితో ముడిపడి ఉన్న కథ కావడంతో తిన్నడి సొంత ఊరు 'ఊటుకూరు'లో ఉన్న శివాలయం మరుగున పడిపోయింది. స్థానికులే దానిని పునరుద్దరణ చేసి పూజలు చేస్తున్నారు. చరిత్ర కారుల ప్రకారం దక్షిణ భారత దేశంలో 'వీర శైవం' ప్రబలంగా ఉన్న సమయంలో కన్నప్ప కథ ప్రాచుర్యంలోకి వచ్చి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం ఉంది. అలాగే తిన్నడు గత జన్మలో అర్జునుడు అని నమ్మేవారూ ఉన్నారు.
రాజ శాసనాలు -పాలకుల కైఫీయత్‌లలో వివరాలుకన్నప్ప మావాడు అంటే మా వాడు అంటూ కన్నడ, తమిళ ప్రజల్లో ఒకప్పుడు వివాదం నడిచేది. అయితే ఊటుకూరు ఆలయ ప్రాంగణంలోని పాతకాలపు రాజ శాసనాల్లో అప్పటికే 'ఊటుకూరు'ని కన్నప్ప జన్మస్థలంగా భావించి పూజలు జరుపుతున్నట్టు ఉండడంతో ఆ వివాదానికి చెక్ పడిందని ఆలయ ప్రధాన అర్చకులు "ఫణి భూషణ శర్మ " తెలిపారు. అలాగే తరువాతి కాలంలో కడపను పాలించిన నవాబులు, ఇతర పాలకుల కైఫీయత్ లలోనూ 'ఊటుకూరు'ను తిన్నడి జన్మస్థలం అని ప్రజలు ఎప్పటి నుండో భావిస్తూ ఇక్కడ పూజలు చేస్తున్నారని నమోదై ఉందని వారు తెలిపారు.
వందల ఏళ్ల నాటి నిర్మాణ శైలిఊటు కూరు శివాలయం లో కన్నప్ప పూజలు జరిపిన శివలింగం బీటలు వారడంతో దానిపై మరో శివ లింగాన్ని ఏర్పాటు చేసారు. ఇది ఆలయ ప్రాంగణం లో ఉంటుంది.గర్భాలయంలో మరొక పురాతన శివలింగం ఉంది. ఇది పడమర అభిముఖం గా ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయం అని అంటారు ఇక్కడి పురోహితులు గడియారం ప్రసాద శర్మ. ఈ గుడికి సాధారణం గా శాంతి పూజలు జరిపించేవారు ఎక్కువగా వస్తారని వారు చెబుతున్నారు.
Also Read: 'కన్నప్ప' ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు... విష్ణు మంచు ఫస్ట్ డే సెంచరీ కొడతారా?
ఆలయాన్ని దర్శించిన మంచు విష్ణుసినీ హీరో, నిర్మాత మంచు విష్ణు ఈ మధ్యే ఊటుకూరు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. తన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ 'కన్నప్ప' రిలీజ్ సందర్బంగా ఆయన తన టీంతో కలిసి ఈ శివాలయం దర్శించి పూజలు జరపడం తో మరోసారి ఈ ఆలయం వార్తల్లో కెక్కింది.
Also Read: ఫ్రీడమ్ ఫైటర్‌గా ఎన్టీఆర్... 'డ్రాగన్'తో రూట్ మార్చిన ప్రశాంత్ నీల్?