టాలీవుడ్ లో ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్పించుకున్న డైరెక్టర్ వివి వినాయక్. కొంతకాలం క్రితం ఆయనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారనే వార్త తెరపైకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా, వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతోందని రూమర్లు వినిపించాయి. అక్కడితో ఆగలేదు ఈ రూమర్స్ గోల. ఏకంగా డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు ఆయన అనారోగ్యం పాడిన పడ్డారన్న విషయం తెలుసుకుని, ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించారని అన్నారు. కానీ తాజాగా ఈ రూమర్లపై డైరెక్టర్ వివి వినాయక స్పందిస్తూ అవన్నీ ఫేక్ రూమర్స్ అని కొట్టి పారేశారు.
అనారోగ్యం వార్తలపై స్పందించిన డైరెక్టర్
ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన అనారోగ్యం బారిన పడ్డారని వస్తున్న వార్తలన్నీ ఫేక్. వివి వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలన్ని అవాస్తవం అంటూ అధికారికంగా ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. ఆ అఫిషియల్ అనౌన్స్మెంట్ మేరకు ఆయన ప్రస్తుతం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా, వాస్తవాలను తెలుసుకొని ప్రచారం చేయాలి అని మనవి. ఇలాంటి తప్పుడు రూమర్లను ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము" అని వివి వినాయక్ తాజాగా స్పెషల్ నోట్ ని రిలీజ్ చేశారు. దీంతో వివి వినాయక్ స్వయంగా తాను హెల్దీగా ఉన్నానని క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ?
టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా వివి వినాయక్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.. ఆయన దర్శకత్వంలో రూపొందిన దిల్, ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్ కృష్ణ, అల్లుడు శీను వంటి సినిమాలు ట్రెండ్ సెట్టర్స్. ఈ సినిమాలన్నీ కుద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అంతేకాకుండా చిరంజీవి కం బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' మూవీని రూపొందించింది కూడా వివి వినాయకే. అయితే ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేక ఆయన వెనుకబడిపోయారు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన వినాయక్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ రూపొందించిన చివరి మూవీ ఇదే. ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అలాగే ఆయన హీరోగా ప్రకటించిన 'సీనయ్య' మూవీ కూడా ఆగిపోయింది. అయితే గత ఏడాది వివి వినాయక్ కు మేజర్ లివర్ సర్జరీ జరిగిందని వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో ఆయన మరోసారి అనారోగ్యం బారిన పడ్డారనే రూమర్లు బయల్దేరాయి. కానీ అవన్నీ రూమర్లు అంటూ స్వయంగా వివి వినాయక్ కొట్టి పారేయడంతో, ఆయన అభిమానులు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై ఫైర్ అవుతున్నారు.
Also Read: రామ్ చరణ్ కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్... నెక్స్ట్ షూటింగ్ ఎక్కడో తెలుసా?