కోలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'గోవా' 'సరోజ' 'గ్యాబ్లింగ్' 'రాక్షసుడు' వంటి సినిమాలతో టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా 'మానాడు' వంటి టైం లూప్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తో అందరినీ సర్ప్రైజ్ చేసాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'కస్టడీ' సినిమాతో ఆయన నేరుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతున్నారు. 


యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన సినిమా 'కస్టడీ'. ఇది చైతూకి తమిళ్ డెబ్యూ. అరవింద్ స్వామీ, ప్రియమణి, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ బైలింగ్విల్ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అయింది. మే 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 


వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. ''ఇది నా తెలుగు డెబ్యూ. నాగచైతన్యతో నా తొలి తెలుగు సినిమా చేసిందందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని అందించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. 'కస్టడీ' ఇప్పటి వరకూ నా కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తీసిన సినిమా. నేను తమిళ ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా ఉన్నప్పటికీ, తెలుగులో ఇదే నా మొదటి సినిమా కాబట్టి, ఒక తమిళ దర్శకుడిగా నాపై ఎక్కువ అంచనాలు ఉండకపోవచ్చు. 'కస్టడీ' అనేది నేను గతంలో చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన జోనర్ లో తెరకెక్కుతోంది. ఇది కంప్లీట్ యాక్షన్ అండ్ ఇంటెన్స్, ఎమోషనల్ ఫిల్మ్. రియలిస్టిక్ మ్యానర్ లో ట్రై చేసాం. రియల్ యాక్షన్ ఫీల్ ను కలిగిస్తుంది. నేను ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చేస్తున్నా. చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను'' అని తెలిపారు.


''ఒక్క లైన్ లో కథ చెప్పాలంటే, ఇందులో విలన్ చనిపోకుండా హీరో చూసుకోవాలి. సాధారణంగా ప్రతీ సినిమాలో విలన్ ని చంపాలని హీరో అనుకుంటాడు. హీరోని చంపాలని విలన్ చూస్తుంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం విలన్ ను హీరో కాపాడాలి. ఛాన్స్ దొరికితే ఒకరినొకరు చంపుకోవాలని అనుకునేంత కోపం ఉంటుంది కానీ, హీరోకి విలన్ ని ప్రొటెక్ట్ చేయడం తప్ప వేరే ఛాయిస్ లేదు'' అంటూ 'కస్టడీ' మెయిన్ ప్లాట్ ఏంటో దర్శకుడు వెంకట్ ప్రభు రివీల్ చేసారు. 


''గ్లామరస్ పీపుల్ ని నేను డీగ్లామర్ గా చూపించాల్సి వచ్చింది. సినిమా మొత్తం హీరోహీరోయిన్లు రెండు కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తారు. కథంతా 2 రోజుల్లో జరుగుతుంది. 48 గంటల్లో జరిగే స్టోరీ కావడంతో డ్రెస్ చేంజ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇదొక ఇంటెన్స్ మూవీ.. ఫారిన్ సాంగ్స్, డ్రీమ్ సాంగ్స్ ఉండవు.. ఉన్నట్టుండి హీరోహీరోయిన్లు అబ్రాడ్ వెళ్లి పాట పాడుకోవడం లాంటివి ఉండవు. సినిమా స్లో డౌన్ అవుతుందని అలాంటివి పెట్టలేదు. చైతన్య సైతం 'నువ్వేమి చెప్పావో అదే తీయి.. అనవసరంగా సాంగ్స్ పెట్టొద్దు' అని  అన్నాడు'' అని దర్శకుడు తెలిపారు. 


ఇంకా వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. ''చైతూకి నాకు 12 ఏళ్లుగా పరిచయం ఉంది. 'మనాడు' చేస్తున్నప్పుడే చైతన్యకి ఈ స్టోరీ చెప్పాను.. ఈ కథ ఐడియా రాసుకున్న తర్వాత నేను చెప్పిన ఒకే ఒక హీరో చైతన్యనే. ఇది కంప్లీట్ గా ప్రాపర్ బైలింగ్విల్ మూవీ. రెండు భాషల్లో 100 రోజుల పాటు షూట్ చేసాం. అందరికీ తెలుగుతో పాటుగా తమిళ్ కూడా తెలియడం వల్ల షూటింగ్ చేయడం చాలా ఈజీ అయింది'' అని చెప్పారు. ఇది 90స్ బ్యాక్ డ్రాప్ లో తీసిన  ఫిక్షనల్ స్టోరీ. చిన్న స్టోరీనే కానీ, దీన్ని స్క్రీన్ ప్లేతో ఎంతో ఎగ్జైటింగ్ గా ఆసక్తికరంగా చెప్పాం. మీరంతా థియేటర్లలో సర్ప్రైజ్ అవుతారు అని వెంకట్ ప్రభు చెప్పుకొచ్చారు. 


Read Also: అప్పుడు వినేవారు కాదు, ఇప్పుడు వింటున్నారు - సోదరుల విడాకులపై సల్మాన్ ఫన్నీ కామెంట్స్