Sandeep Reddy Vanga Reacts To Rashmika Mandannas Filmfare Nomination: ‘యానిమల్‘ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశారు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో గీతాంజలి పాత్ర పోషించిన రష్మిక, అద్భుత నటనతో ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలలో రణబీర్ ను సైతం డామినేట్ చేసింది. అయితే, తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఫీమేల్ లీడ్ విభాగంలో రష్మిక మందన్న పేరు లేకపోవడంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆశ్చర్యపోయారు. రష్మికకు నామినేషన్ దక్కకపోవడంపై షాక్‌కు గురైనట్లు చెప్పారు.


గీతాంజలి పాత్రలో నటించడం సులభం కాదు- సందీప్


నిజానికి ‘యానిమల్‘ సినిమా  ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్ 2024లో ఏకంగా 19 కేటగిరీలలో నామినేషన్లు అందుకుంది. 5 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ సౌండ్ డిజైన్‌తో సహా ఐదు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది. అయితే, బెస్ట్ ఫీమేల్ లీడ్ విభాగంలో రష్మిక మందన్న అసలు నామినేషన్ కూడా దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో సందీప్ వంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో నటించడం అంత సులభమేమీ కాదు. ఒక్క సన్నివేశంలోనే చాలా హావభావాలు పలికించాలి. నవ్వడం, అరవడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం సహా పలు ఎక్స్ ప్రెషన్స్ ఒకే సన్నివేశంలో చేయాలి. 11 నిమిషాలున్న ఆ సీన్‌లో రష్మిక అద్భుతంగా నటించింది. నిజానికి నాకు అవార్డుల మీద నమ్మకం లేదు. అయితే, ఫిల్మ్‌ ఫేర్‌ లో ‘యానిమల్‌’ 19 కేటగిరీల్లో నామినేషన్లు పొందింది. చిత్ర బృందం అంతా ఆ వేడుకలో పాల్గొన్నది. దర్శకుడిగా నేను వెళ్లకపోవడం భావ్యం కాదనే ఒకే ఒక ఉద్దేశంతో నేను వెళ్లాను” అని సందీప్ రెడ్డి వెల్లడించారు.   


‘యానిమల్’ మూవీ గురించి..


గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘యానిమల్‌’ మూవీలో రణబీర్ కపూర్ హీరోగా నటించారు. అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు. రణబీర్  లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అద్భుతంగా అలరించింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సీక్వెల్ పైనా సందీప్ వంగ క్లారిటీ ఇచ్చారు. ‘యానిమల్ పార్క్’ పేరుతో సీక్వెల్ తెరకెక్కనున్నట్లు వెల్లడించింది. అటు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


Read Also: హాలీవుడ్ రేంజిలో ‘గామి‘ మేకింగ్, స్టన్నింగ్‌ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్