Prabhas Raja Saab Movie Update: మార్చి 28న రిలీజ్ కాబోతున్న హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి స్పెషల్ గెస్ట్‌గా హాజరైన డైరెక్టర్ మారుతి... ఇదే వేదికపై ఆయన ప్రభాస్‌తో తీస్తున్న 'ది రాజాసాబ్' మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకున్నారు. 

బెస్ట్ అవుట్ పుట్... ధైర్యంగా ఉండండి 

'మ్యాడ్ స్క్వేర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ సుమ ప్రభాస్‌తో ఆయన రూపొందిస్తున్న 'ది రాజా సాబ్' మూవీ గురించి అప్డేట్ ఇవ్వమని అడిగింది. ఆ ప్రశ్నకి డైరెక్టర్ మారుతి స్పందిస్తూ "నాతో ఎలాంటి సినిమా తీస్తే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందో అలాంటి సినిమానే తీస్తున్నాము. అందుకే కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి..  అప్పుడే ది బెస్ట్ ఔట్పుట్ వస్తుంది" అంటూ ప్రభాస్ అభిమానులకు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా మరోవైపు 'ది రాజా సాబ్' టీజర్ లోడ్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. 

ఇప్పటికే మారుతి ఇండస్ట్రీలో తన సన్నిహితులకు మూవీకి సంబంధించిన రఫ్ కట్ చూపించారని, ఈ సినిమా నెవర్ బిఫోర్ సర్ప్రైజ్‌లతో అదరగొట్టబోతుందని టాక్ నడుస్తోంది. ఇక త్వరలోనే రిలీజ్ చేయబోతున్న ఈ టీజర్‌లో ట్రెండింగ్ డైలాగ్స్‌తో పాటు స్టైలిష్ లుక్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఉంటాయని సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. డార్లింగ్ అభిమానులకు ఇది ఒక సర్ప్రైజింగ్ విజువల్ ట్రీట్ అవుతుందని... టీజర్ షాట్ స్టైల్, థ్రిల్, స్టెప్ కలగలిపి ఉండే విధంగా ఇంట్రెస్టింగా కట్ చేస్తున్నారని అంటున్నారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి మారుతి ఫుల్ మీల్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారని టాక్ నడుస్తోంది. డైరెక్టర్ మారుతి కూడా "కంగారు పడకుండా ఉంటే ది బెస్ట్ వస్తుంది" అంటూ ఇప్పుడు ఇదే మాట చెప్పారు. కాబట్టి అప్డేట్ కోసం రెబల్ స్టార్ అభిమానులు కంగారు పెట్టకుండా ఉంటే త్వరలోనే థియేటర్లలో 'ది రాజా సాబ్' నుంచి మంచి విజువల్ ట్రీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 

ఉగాది కానుకగా 'మ్యాడ్ స్క్వేర్' 

ఇక 'మ్యాడ్ స్క్వేర్' మూవీ విషయానికి వస్తే... నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా రూపొందుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'మ్యాడ్ స్క్వేర్'. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ 2023లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన 'మ్యాడ్'కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఈనెల 28న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా నాగ చైతన్య ముఖ్య అతిథిగా, డైరెక్టర్ మారుతీ, మరో డైరెక్టర్ వెంకీ అట్లూరి స్పెషల్ గెస్ట్‌లుగా హాజరయ్యారు.