Tollywood Latest News: మిస్టర్‌ బచ్చన్‌ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ దర్శకుడు హరీష్‌శంకర్ మాత్రం తగ్గడం లేదు. తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ఉస్తాద్ భగత్‌సింగ్‌ పనుల్లో బిజీగా ఉంటూనే మరో హీరోతో సినిమాకు రెడీ అయినట్టు లీకులిచ్చాడు. మిస్టర్‌ బచ్చన్ సినిమాపై యూత్‌తో ఇంట్రాక్ట్ అయిన హరీష్‌ ఇప్పుడు నడుస్తున్న ట్రోలింగ్, తర్వత చేయబోయే సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. 


ఎనర్జిటిక్‌ హిరో రామ్‌తో త్వరలోనే సినిమా చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ హరీష్‌ శంకర్‌. ఇప్పటికే ఆయనతో చాలాసార్లు సమావేశమైనట్టు చెప్పుకొచ్చాడు. ఇద్దరు హీరోలు ఉంటే ఓ స్టోరీ గురించి చెబితే ఆయన నుంచి వచ్చిన రియాక్షన్ చాలా నచ్చిందన్నారు. ఆ స్టోరీలో ఎలాంటి ఫైట్స్ ఉండవని కనీసం చెంపదెబ్బలు కూడా ఉండవి తన స్టైల్‌కు పూర్తి భిన్నంగా ఉండే కథ అన్నాడు. అలాంటి స్టోరీ ఆయనకు చెబితే... మనం చేయబోయే సినిమా ఫ్యాన్ ఐదులో తిరగాలని ఇప్పుడు నువ్వ చెప్పిన స్టోరీ ఫ్యాన్ రెండులో తిరిగినట్టు ఉందని అన్నాడు. ఆడైలాగ్‌ తనకు చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. 



ఆ డైలాగ్‌ను దృష్టిలో పెట్టుకొని మంచి స్టోరీ రెడీ చేస్తున్నట్టు తెలిపాడు హరీష్‌. రామ్ చెప్పినట్టు ఫ్యాన్ ఐదులో కాకుండా టాప్‌ లేచిపోయే సినిమా చేయబోతున్నామని త్వరలోనే అన్నీ చెబుతానని అన్నారు. 


ట్రోలింగ్‌పై తన స్టైల్ రియాక్షన్: హరీష్


మిస్టర్‌ బచ్చన్‌ సినిమా రిలీజ్‌కు ముందు ఆ తర్వాత తనపై సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్‌పై కూడా హరీష్‌ స్పందించారు. తనకు ఓ క్యారెక్టర్ ఉందని... ఏ సందర్భంలోనైనా ఒకేలా ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్‌ సినిమాలోని డైలాగ్‌ చెప్పారు. తాను ఆకాశం లాంటి వాడినని మెరుపు వచ్చినా ఉరుము వచ్చినా ఒకేలా ఉంటానని అన్నాడు. 


వాటికి అతీతులు వాళ్లు: హరీష్


మిస్టర్‌ బచ్చన్ సినిమా రిలీజైన తర్వాత రవితేజాను ఓ సినిమా షూటింగ్‌లో కలిస్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని సినిమా గురించి కూడా మాట్లాడినట్టు తెలిపారు. ఏంటీ డివైడ్ టాక్ వచ్చినట్టు ఉంది... ఏం ఫర్వాలేదని చెబుతూ షాట్‌కు వెళ్లిపోయారన్నారు. రవితేజ, పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాపై రియాక్ట్ అవుతారని అన్నారు. గబ్బర్ సింగ్ హిట్ అయిన తర్వాత పవన్ కలిస్తే ఆ విషయం తప్ప అన్నీ మాట్లాడారని అన్నారు. 


ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదలైంది. ఈ సినిమాతోపాటు మరో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా అదే రోజు వచ్చింది. తమిళ డబ్బింగ్‌ చిత్రం తంగలాన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నేనితిన్‌ నటించని ఆయ్‌ మూవీ ఆగస్టు 15, రాఖీ అండ్ లాంగ్ వీకెండ్‌ని దృష్టిలో పెట్టుకొని రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో మిస్టర్ బచ్చన్‌తో పోలిస్తే డబుల్ ఇస్మార్ట్ ఫర్వాలేదని టాక్ నడుస్తోంది. మిగతా రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌తో రన్ అవుతున్నాయి. 


Also Read: గిఫ్ట్ ఇవ్వలేక రాఖీ తిరిగిచ్చే హీరో, అమ్మాయిలతో మాట్లాడలేని ఫ్రెండ్ - ఆసక్తి పెంచిన 'బ్రహ్మ ఆనందం' గ్లింప్స్


Also Read: వేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్ - సూర్య సినిమాకు పోటీగా