Santhosham : అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో 'సంతోషం' ఒకటి. క్లీన్‌ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియాతో పాటు గ్రేసీ సింగ్‌ కథానాయికగా కనిపించిన విషయం తెలిసిందే. దశరథ్.. ఈ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెరకెక్కడం వెనుక జరిగిన చర్చల గురించి ప్రస్తావించిన ఆయన.. 'సంతోషం' మూవీకి నాగార్జున ఎలా ఓకే చెప్పారన్న ఆసక్తికర విషయాలను ఇటీవల దశరథ్ ఓ ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు.


"సంతోషం మూవీ కోసం అక్కినేని నాగార్జున దగ్గరికెళ్లి కథ చెప్పాం. చెప్పగానే ఆయన కూడా ఓకే చెప్పేశారు. అదే రోజు ‘నువ్వు నేను’ సినిమాలోని గాజువాక పిల్లా.. సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఆ టైంలోనే గోపాల్ రెడ్డి నాకు చాలా సార్లు కాల్ చేశారు. ఆ మెసేజ్ లు చూసుకుని ఆయనకు ఫోన్ చేశాను. నాగార్జున గారు మిమ్మల్నే డైరెక్ట్ చేయమంటున్నారు. ఇమ్మిడియట్ గా కలవమన్నారు. అప్పటికి ఈ షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నాను. అంతలోనే నాగార్జున నుంచి పిలుపు వచ్చింది. ఆయన దగ్గరకు వెళ్లగానే ఆగస్టులోనే స్టార్ట్ చేయాలన్నారు. దానికి రెండు నెలలు కూడా టైమ్ లేదు. అంత టైంలో సినిమా అంటే చేయలేను అని చెప్పాను. ఆ తర్వాత లిస్ట్ లో ఎవరున్నారని చూస్తే.. మలయాళం నటుడు ఫాజిల్ ను పిలుద్దాం అనుకున్నాం. నెక్స్ట్ డే మళ్లీ అవే కాల్స్. నాగార్జున అర్జంట్ గా మీతో మాట్లాడాలని అంటున్నారని చెప్పారు. అక్కడికి వెళ్లగానే నా సినిమా ఎందుకు చేయవని అడిగారు. కారణం చెప్పాను. ముందే ఫస్ట్ సినిమా కదా.. పోతే అడుక్కు తినాలి. నేను చేయలేనని చెప్పేశా. మరి ఎంత కాలం పడుతుంది నీకు అని నాగార్జున అడిగితే.. 6, 7 నెలలు పడుతుందని చెప్పాను. సరే అని.. నాకు నవంబర్ వరకు టైం ఇచ్చారు. నవంబర్ వరకు ఏ సినిమా చేయనని కూడా చెప్పారు. ఒక హీరో అంత సిన్సియర్ గా ఉండడమనేది చాలా గ్రేట్. ఒక పేరున్న, ఆ స్థాయిలో ఉన్న హీరో వెయిట్ చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ సినిమా సక్సెస్ అయిందంటే మాత్రం చాలా మంది హస్తం ఉంటుంది" అని డైరెక్టర్ దశరథ్ స్పష్టం చేశారు.


ఎలా ఛాన్స్ వచ్చిందంటే..


"ముందుగా 'జయం' సినిమా చేయాల్సింది. కానీ అనుకోకుండా నువ్వు నేను చేశాం. నిజానికి 'జయం' అప్పటికి స్క్రిప్ట్ కూడా అయిపోయింది. అన్ని క్యారెక్టర్స్ డిసైడ్ అయిపోయాయి. ఆ సినిమాలోని 'వీరీ వీరీ గుమ్మడి పండు..' ట్యూన్ కూడా అయిపోయింది. ఎందుకో అది కాకుండా 'నువ్వు నేను' చేయాల్సి వచ్చింది. ఆ సినిమాలో చేసిన బెనర్జీ గారే నన్ను తీసుకెళ్లి కె.ఎల్. నారాయణ రావు, గోపాల్ రెడ్డికి పరిచయం చేశారు. అలా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చింద"ని దశరథ్ తెలిపారు.


Read Also : Highest Paid Telugu Actresses: టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు వీళ్లే, ఒక్కో మూవీకి ఎంత వసూలు చేస్తారంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial