టైమ్ ట్రావెల్.. మంచి క్రియేటివ్ కంటెంట్ ఉండాలేగానీ, ఈ కాన్సెప్ట్‌తో ఎన్ని మూవీస్ తీసిన ప్రేక్షకులు ఆధరిస్తారు. నాటి ‘ఆదిత్య 369’ నుంచి నేటి ‘ఒకే ఒక జీవితం’ మూవీ వరకు.. ప్రతి ఒక్కటీ ప్రేక్షకాధరణ పొందినవే. తాజాగా ‘7:11 PM’ టైటిల్‌తో మరో టైమ్ ట్రావెల్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. 


ఈ సినిమాకు చైతు మాదాల దర్శకత్వం వహించారు. సాహస్, దీపిక హీరో హీరోయిన్ లుగా నటించారు. ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. ఆసక్తిరేకెత్తించే స్క్రీన్ ప్లేతో నడిచే ఈ సినిమా టైమ్ ట్రావెల్, ఇంటర్ స్టెల్లార్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో నడిచే క్రైమ్ యాక్షన్ డ్రామా అని మేకర్స్ తెలిపారు. 1999 లో హంసలదీవి అనే ఒక పట్టణం చుట్టూ సాగే టైమ్ ట్రావెల్ కథలా ట్రైలర్‌ను చూపించారు. 1999లో ఒక ముఖ్యమైన రోజున, భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం “హంసలదీవి” అనే చిన్న పట్టణానికి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్ ని నాశనం చేయడానికి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒక పట్టణం, రెండు గ్రహాలు, మూడు టైమ్ పిరియడ్‌లు.. చుట్టూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 



ట్రైలర్ ప్రకారం.. హీరో తనకు తెలియకుండానే టైమ్ ట్రావెల్ చేస్తాడు. అనుకోకుండా అతడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సముద్ర తీరానికి కొట్టుకొని వస్తాడు. దీంతో ఆస్ట్రేలియా అధికారులు అతడిని అదుపులోకి తీసుకుంటాడు. తాను ఇండియాలో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో ఉన్నానని అధికారులకు వివరణ ఇస్తాడు. దీంతో అధికారి ‘‘బస్సు ఎక్కి వచ్చావా? ఆఫ్ వేసి వచ్చావా’’ అని వెటకారం అడుగుతాడు. తర్వాత అతడి ఊరి పేరు చెబుతాడు. తాను హంసలదీవి నుంచి వచ్చానని, తిరిగి తనని అక్కడికి పంపించాలని అంటాడు. దీంతో అధికారులు మ్యాప్ సాయంతో ఆ ఊరిని కనుగొనే ప్రయత్నం చేస్తారు. కానీ, మ్యాప్‌లో ఆ ప్రాంతంలో ఊరే ఉండదు. తన ఊరు మొత్తం శిథిల స్థితిలో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆ ఊరిలో హీరో సాధారణ జీవితం గడపడం, లవ్ స్టోరీు.. విలన్లతో పోరాటం ఇలా.. పలు సీన్లతో ట్రైలర్ నిండిపోయింది. మొత్తానికి ట్రైలర్ కొత్త అనుభూతినే ఇస్తుంది. అయితే, కాన్సెప్ట్‌కు ఇంకాస్త బడ్జెట్ పెట్టి ఉంటే మరింత రిచ్‌గా మూవీ కనిపించేదని అనిపిస్తుంది. ఈ మూవీని మైత్రీ మూవీస్ రిలీజ్ చేయనుంది. జులైన 7న థియేటర్లలో విడుదల కానుంది. మరి, ప్రేక్షకులకు ఈ కాన్సెప్ట్ నచ్చుతుందో లేదో చూడాలి.


Read Also : ఎయిర్ పోర్టులో లూయిస్ విట్టన్ బ్యాగ్‌తో కనిపించిన ఎన్టీఆర్, దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial