Atlee About Allu Arjun 'AA22' Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో హై ఆక్టేన్ పాన్ వరల్డ్ రేంజ్‌లో 'AA22' మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్ డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. ఓ వేడుకలో ఈ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.

భారీ బడ్జెట్.. న్యూ టెక్నాలజీ

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్. ఆయన రేంజ్‌, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లుగా ఈ మూవీ ఉండబోతుందనేదే అనౌన్స్‌మెంట్ వీడియో బట్టే తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో బజ్ తప్ప అటు బన్నీ నుంచి కానీ ఇటు అట్లీ నుంచి కానీ ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా.. సత్యభామ వర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న అట్లీ ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సరికొత్త టెక్నాలజీతో ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందించనున్నట్లు అట్లీ తెలిపారు. 'ఈ మూవీ దేశంలోనే ఖరీదైనది. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. బడ్జెట్ ఎంతనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మూవీ లవర్స్ అంతా గర్వపడేలా మూవీ ఉంటుంది. సినిమా తీయడం వరకే నా బాధ్యత. రిలీజ్ డేట్ ఎప్పుడనేది నిర్మాత కళానిధి మారన్ నిర్ణయిస్తారు.' అని అన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: 'SSMB29' మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ - దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదంతే..

బన్నీ విషెష్

ప్రతిష్టాత్మక యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న అట్లీకి.. బన్నీ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. దీనిపై స్పందించిన అట్లీ.. అల్లు అర్జున్‌కు థ్యాంక్స్ చెప్పారు.

ముంబైలో షూటింగ్

ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తై ముంబైలో షూటింగ్ మొదలు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తారని అట్లీ కన్ఫర్మ్ చేయగా.. మరో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. బన్నీ, మృణాల్‌పై కీలక సీన్స్ షూట్ చేశారనే ఇండస్ట్రీ వర్గాల టాక్. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ ప్లాన్ చేయగా.. దాదాపు ఐదుగురు హీరోయిన్లను తీసుకోనున్నట్లు సమాచారం.

దీపికా, మృణాల్‌తో పాటు అనన్య పాండే, భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్‌లను కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక బన్నీ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తారని సమాచారం. సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై మూవీని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.