Director AS Ravi Kumar Chowdary Serious On Reviewers : ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యిందంటే.. వెంటనే రివ్యూలు వచ్చేస్తున్నాయి. దీంతో చాలామంది ప్రేక్షకులు రివ్యూలు చూసి సినిమాకి వెళ్లాలా? లేదా ఓటీటీలో చూడాలా? అని ఫిక్స్ అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో కలెక్షన్ల మీద గట్టి దెబ్బ పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ నెగటివ్యూ రివ్యూలు రావడంతో మంచి సినిమాలు కూడా ఆడకుండా పోతున్నాయి. అయితే, రివ్యూలు రాసేవాళ్లపై ‘తిరగబడరాసామి’ సినిమా డైరెక్టర్ రవికుమార్ చౌదరి తీవ్ర కామెంట్స్ చేశారు. వాళ్లకు ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇలా అంటున్నాను అని ఏమి అనుకోవద్దు, మీరు మీ పని చేస్తున్నారు అని అంటూనే రివ్యూ రాసేవాళ్లకి చురకలు అంటించారు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.
రాసేముందు ఆలోచించండి
రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా ‘తిరగబడరాసామి’. ఆగస్టు 2న రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో సక్సెస్ మీట్ నిర్వహించారు నిర్వాహకులు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన సినిమా డైరెక్టర్ రవికుమార్ చౌదరి రివ్యూలు రాసేవాళ్లకి వార్నింగ్ ఇచ్చారు. రాసేముందు ఆలోచించాలి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అందరికీ.
"రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి హ్యాట్సాఫ్ చెప్తున్నాను. నిన్నటి కంటే ఈరోజు కలెక్షన్స్ పెరిగాయి. థియేటర్ల సంఖ్య పెరిగింది. మంచి సినిమాని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఏ రివ్యూలు అడ్డుకోలేవు. ఎందుకంటే ఒక సినిమా బతికితే ఎంతోమంది బతుకుతారు. వాళ్ల పిల్లలకి బట్టలు కొనివ్వగలరు, వాళ్ల ఇంట్లో వాళ్లకి తిండి పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడ్ గా రాసి ఆ సినిమాని చంపేస్తే.. వందల కుటుంబాలు రోడ్డున పడతాయి. వాళ్లందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తాయి’’ అని అన్నారు.
‘‘ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. 33 ఏళ్ల నుంచి ఉన్నా ఇండస్ట్రీలో. ఈ రోజు కొత్తగా వచ్చి రాసేస్తున్నారు చాలామంది. పెద్ద పుడింగి అనుకోవద్దు. సీనియర్ల సలహా తీసుకోండి. కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మనం కూడా బతుకుతాం. మీరు కూడా సినిమాలో ఒక పార్టే. తప్పుగా ఎవ్వరూ అనుకోవద్దు. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీ ఛానెల్స్ లో మీరు రాయాలి. స్పైసీ న్యూస్ రాస్తున్నామని, రివ్యూలు రాస్తున్నాము అని చెప్పి సినిమాని కిల్ చేస్తే.. మనం ఉరి వేసుకున్నట్లు లెక్క. ఒక నిర్మాత సినిమా తీస్తే వందలమంది బతుకుతారు. గేట్ దగ్గర వాచ్ మెన్ నుంచి ఎంతోమంది బతుకుతారు. ఒక సినిమా తీస్తే.. లాభం వచ్చినా? నష్టం వచ్చినా అది ఆరు నెలలు 100 కుటుంబాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది" అని అన్నారు ఆయన.
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర కలిసి నటించిన సినిమా ‘తిరగబడరాసామి’. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది.
Also Read: మమ్ముట్టికి 15వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు - సంతోషం లేదన్న మెగాస్టార్, కారణం ఏంటంటే..