దర్శకుడిగా తొలి సినిమా చిత్రీకరణలో ఉండగా... మాలీవుడ్ డైరెక్టర్ లిజు కృష్ణ (Director Liju Krishna) పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన వివాదంలో  చిక్కుకున్నారు. అసలు, ఏమైంది? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...


నివిన్ పౌలి కథానాయకుడిగా మలయాళంలో 'పడవెట్టు' (Malayalam Film Padavettu) సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో లిజు కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం సినిమా అండర్ ప్రొడక్షన్‌లో ఉంది. లిజు కృష్ణ తనపై అత్యాచారం చేశాడని, లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కక్కండ్ ఇన్ఫో పార్క్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ 376 సెక్షన్ అనుసరించి... కన్నూర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు లీజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడం (Mollywood Film Director Liju Krishna Accused Of Rape, Arrested) మలయాళ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది.


లిజు కృష్ణ అరెస్టును ధృవీకరించిన పోలీసులు, అతను మించి ఇతర వివరాలు వెల్లడించలేమని చెప్పారు. సోమవారం (ఈ రోజు, ఫిబ్రవరి 7న) కొచ్చిలోని కోర్టులో ఆయన్ను హాజరు పరచనున్నారు. కేరళలో మరో లైంగిక వేధింపుల కేసులో టాటూ ఆర్టిస్ట్ సుజీత్ పీఎస్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయనపై ఆరుగురు మహిళలు కేసు పెట్టినట్టు సమాచారం.


Also Read: 'రాధే శ్యామ్' నుంచి 'రౌడీ బాయ్స్' వరకూ... ఈ వారం థియేటర్ / ఓటీటీ వేడుకలలో విడుదల కాబోయే సినిమాల వివరాలు...


'పడవెట్టు' సినిమాలో నివిన్ పౌలితో పాటు మంజూ వారియర్, అదితి బాలన్ తదితరులు నటిస్తున్నారు. లిజు కృష్ణ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ వేన్ నిర్మిస్తున్నారు. దర్శకుడి అరెస్టుతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.


Also Read: 67 ఏళ్ల వయస్సులోనూ కండలు తిరిగిన దేహంతో అనుపమ్ ఖేర్


'పడవెట్టు' సినిమాలో నివిన్ పౌలి