బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) వయసు ఎంతో తెలుసా? 67 ఏళ్ళు. ఈ రోజు ఆయన పుట్టినరోజు (Anupam Kher Birthday). 67వ సంవత్సరంలో అడుగు పెట్టారు. ఈ వయసులోనూ ఆయన కండలు తిరిగిన దేహంతో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయడమే కాదు, వ్యాయామం చేయాలనుకునే వాళ్ళకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో కండలు తిరిగిన దేహం (Anupam Kher Chiselled Body) తో ఉన్న ఫొటో ఉంది. కొన్ని రోజుల నుంచి తాను ఫిట్‌గా ఉండటం కోసం ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఏడాది 'బాడీ ఆఫ్ ద ఇయర్' అని చెప్పుకొచ్చారు.
"మీరు 35 ఏళ్ళ క్రితం ఓ నటుడిని కలిశారు... అతడు 65 ఏళ్ళ పాత్ర చేశారు. నా కెరీర్ అంతా నటుడిగా కొత్త పాత్రలు అన్వేషించా. అయితే... ఎప్పుడూ నా లోపల ఒక కల ఉండేది. దాన్ని నిజం చేయడానికి నేను ఏమీ చేయలేదు. ఆ కల ఏంటంటే... ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం! ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించాను. ఓ ఏడాది తర్వాత ఈ ప్రయాణంలో మంచి రోజులు, కష్టంగా అనిపించిన రోజులను మీతో పంచుకుంటాను" అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.
అనుపమ్ ఖేర్ కొత్త ఫొటోలు చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయితే... సినిమా సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెబుతున్నారు.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?