Anil Ravipudi About Sankranthiki Vasthunam Sequel: అనిల్‌ రావిపూడి, హీరో వెంకటేష్‌ది హిట్‌ కాంబో. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు. దీంతో ఈ కాంబో సినీ వర్గాలతో పాటు ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. వెంకీమామా, అనిల్‌ రావిపూడి కలిస్తే సంక్రాంతే అంటున్నారు ఆడియన్స్‌. అంతగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతోంది. ఎఫ్‌ 2 సీక్వెల్‌ మంత్రనే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంకు అప్లై చేస్తున్నాడు అనిల్‌ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్‌ అయ్యింది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. రెండో రోజుకే థియేటర్ల పెంచుకుని కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.

ఐదు రోజుల్లో రూ. 161 కోట్ల గ్రాస్

ఐదు రోజుల్లో ఈ సినిమా రూ. 161 పైగా కోట్లు గ్రాస్‌ చేసి వెంకటేష్‌ కెరీర్‌ హయ్యేస్ట్‌ గ్రాస్‌ మూవీగా నిలిచింది. ఇంకా వీకెండ్‌ కావడంతో ఈ మూవీ వసూళ్లు ఇంకా పెరగే అవకాశం ఉందని, ఈ ఆదివారానికి మూవీ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు. ఇక మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం టీం సక్సెస్‌ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ మీట్స్‌, ఇంటర్య్వూలతో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో హీరో వెంకటేష్‌, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి, చైల్డ్‌ ఆర్టిస్టు రేవంత్‌(వెంకటేష్‌ కొడుకు బుల్లిరాజు), దర్శకుడు అనిల్‌ రావిపూడిలను యాంకర్‌ సుమ ఇంటర్య్వూ చేసింది.

సీక్వెల్‌పై అప్డేట్

ఈ సందర్భంగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అదే విధంగా ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని స్పష్టం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. "సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్‌ ఉంటుంది. ఇదే టెంప్లేట్‌(కాన్సెప్ట్‌)తో సినిమా ఉంటుంది. సీక్వెల్‌కి కూడా ఇదే టైటిల్‌ ఉండొచ్చా? అని సుమ అడగ్గా.. అది అనిల్‌ చేతుల్లోనే ఉందని ఐశ్వర్య రాజేష్‌ చెప్పారు. దీంతో అనిల్‌ రావిపూడి కల్పించుకుని ఆ విషయంలో సీక్వెల్లో తెలుస్తుందన్నారు. ఈ సీక్వెల్‌ కూడా మళ్లీ సంక్రాంతి వచ్చే అవకాశం ఉందని ఆయన ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చారు. 

"సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెల్‌ చేయడానికి ఎక్కువ స్కోప్‌ ఉంది. ఎందుకంటే ఈ కాన్పెప్ట్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. దీన్నే మరో పరిస్థితుల్లో సినిమా చెయొచ్చు. కాబట్టి ఈ సినిమా సీక్వెల్‌ చేసే ప్లాన్‌ ఉంది. మూవీని రాజమండ్రిలో ఎండ్‌ చేశాం. కాబట్టి సీక్వెల్‌ అక్కడి నుంచే ప్రారంభిస్తే మరో అద్భుతం చేయొచ్చు" అంటూ సీక్వెల్‌పై బజ్‌ క్రియేట్‌ చేశారు. దీంతో మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్‌ ఉంటుందని మూవీ టీం ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఎండ్‌లోనూ చెప్పలేదు. కానీ మూవీకి ఇచ్చిన శుభం కార్డు చూసి ఆడియన్స్‌ అంతా ఈ సినిమా సీక్వెల్‌ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అనిల్‌ రావిపూడి కామెంట్స్‌తో అది స్పష్టం అయ్యింది. ఇక నెక్ట్స్‌ ఇయర్ కూడా వెంకీమామకు బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌ అవ్వాలని అభిమానులంతా ఆశిస్తున్నారు. 

కాగా ఈ సినిమా తొలి రోజు రూ. 45 కోట్ల గ్రాస్‌ చేసి వెంకటేష్‌ కెరీర్‌లోనే హయ్యేస్ట్‌ ఒపెనింగ్‌ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. ఇక మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టిన ఈ చిత్రం 5 రోజుల్లో రూ. 161 పైగా కోట్ల గ్రాస్‌తో రికార్డు దూసుకుపోతుంది. ఇప్పటికీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈచిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. దీంతో మళ్లీ మళ్లీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు పెద్దగా థియేటర్లకు రానివారు కూడా సంక్రాంతికి వస్తున్నాం చూసేందుకు థియేటర్‌లకు వస్తున్నారు.