నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా రూపొందిన సోషియో ఫాంటసీ సినిమా 'బింబిసార'. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఆగస్టు 5న థియేటర్లోకి సినిమా రానుంది. విడుదలకు రెండు వారాల ముందే ఫైనల్ కాపీ రెడీ చేశారని తెలుస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే...
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ 'దిల్' రాజు 'బింబిసార' (Bimbisara Movie) చూశారు. ఈ రోజు ఉదయం ఆయన కోసం ప్రత్యేకంగా షో వేశారు. ఆయనకు సినిమా చాలా బాగా నచ్చిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పక్కా హిట్ అని చెప్పారట. కళ్యాణ్ రామ్ కి కంగ్రాట్స్ చెప్పారట. నైజాంలో 'బింబిసార'ను 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తీసుకున్నారట.
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన 'బింబిసార' ద్వారా వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెండో పాటను రేపు విడుదల చేయనున్నారు.
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్లు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.
Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్