Ranveer Singh's Dhurandhar Movie Three Days Collections : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన మూవీ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
3 రోజుల్లోనే...
కేవలం 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ మేరకు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో 3 గంటల 34 నిమిషాల రన్ టైంతో వచ్చిన 'ధురంధర్' ప్రేక్షకుల అంచనాలను మించి సక్సెస్ సాధించింది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్ల వసూళ్లు సాధించి... రణవీర్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ.100 కోట్ల బరిలో నిలిచిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఫస్ట్ డేనే ఏకంగా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా... ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా రూ.103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. గ్రాస్ పరంగా రూ.123.5 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీనిపై మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మూవీలో రణవీర్ సింగ్‌తో పాటు బాలీవుడ్ హీరోస్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... దేశ రక్షణ కోసం చేసే ఆపరేషన్ 'ధురంధర్'ను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్టోరీ ఏంటంటే?
1999లో విమాన హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో టెర్రరిస్ట్ ఎటాక్స్ తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) ఓ కీలక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ముందు తన ప్రతిపాదన ఉంచుతాడు. దాయాది దేశం పాక్‌ను చావుదెబ్బ కొట్టేందుకు ఆ దేశంలో ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా అంతం చేసేందుకు 'ఆపరేషన్ ధురంధర్' పేరుతో ఓ రహస్య మిషన్‌కు శ్రీకారం చుడతాడు.
ఇందులో భాగంగానే తీవ్రవాద చీకటి సామ్రాజ్యంలోకి ఇండియన్ ఏజెంట్‌ను పంపాలని నిర్ణయించుకుంటాడు. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న ఓ యువకుడిని భారత ఏజెంట్‌గా హమ్జా (రణవీర్ సింగ్) మారుపేరుతో పాక్‌లోకి పంపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇండియన్ రహస్య ఏజెంట్‌గా దాయాది దేశంలో అతని ప్రయాణం ఎలా సాగింది? కరాచీ అడ్డాగా ఉగ్రవాద ముఠాల్ని తయారుచేస్తోన్న రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా)ను హమ్జా ఎలా అంతం చేశాడు? పాక్‌లో హమ్జాకు ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.