Dhanush Raayan Screenplay elected for Oscar Library: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'రాయన్‌'. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమ మంచి ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్‌ రాబోతుంది. స్వయంగా ధనుష్‌ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కింది. అయితే విడుదలైన కొన్ని రోజులకే ఈ మూవీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. విడుదలై వారం కూడా కాలేదు. తాజాగా ఈ సినిమా ఆస్కార్‌ లైబ్రరీలో చోటు దక్కించుకుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ లైబ్రరీలో 'రాయన్‌' స్క్రీన్‌ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సన్‌ పిక్చర్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో మూవీ టీం శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా ఆస్కార్‌ స్క్రీన్‌ప్లే చోటు దక్కించుకోవడమంటే సాధారణ విషయం కాదు. విశేష ఆదరణ పొందిన గొప్ప స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లేలకు మాత్రమే ఆస్కార్‌ అకాడమీ లైబ్రరీలో చోటు కల్పిస్తారు. అలాంటిది ధనుష్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం రాయన్‌క ఈ ఘనత సాధించడం విశేషం. 







ఇక రాయన్‌తో పాటు గతేడాది వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన 'వ్యాక్సిన్‌ వార్‌' కూడా ఆస్కార్ లైబ్రరీలో శాశ్వత స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.అలాగే తమిళ చిత్రం 'పార్కింగ్‌'కి కూడా ఈ గౌరవం లభించింది. రాయన్‌ మూవీ ధనుష్‌ నటించిన 50వ చిత్రమిది. తన స్వీయ దర్శకత్వంలో యాక్షన్‌ క్రైం ఫిలిం రూపొందింది. ఈ సినిమా ధనుష్‌ యాక్టింగ్‌, దర్శకత్వ స్కిల్స్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో అపర్ణా బాలమురళీ, సందీప్‌ కిషన్‌, దుషారా విజయ్‌న్‌లు కీలక పాత్రలు పోషించారు. ధనుష్‌ కెరీర్‌లో వారం రోజుల్లోనే అత్యధిక ఒపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా రాయన్‌ రికార్డు నెలకొల్పింది. 



Also Read: 'VD12' రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెప్పిన మూవీ టీం - షాకింగ్‌ లుక్‌లో విజయ్‌ దేవరకొండ, మరి ఇలా ఉన్నాడేంటి!