Dhanush is a fan of Pawan Kalyan: కోలీవుడ్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా - ఆదివారం రాత్రి నుంచి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో, డిజిటల్ మీడియాలో ఇదే డిస్కషన్. దీనికి ఓ కారణం ఉంది. అది ఏమిటి? అంటే... 


ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్' (Raayan Movie). ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ (Raayan Pre Release Event) నిర్వహించారు. అందులో తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు ధనుష్ ఏం చెప్పారో తెలుసా?


పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం! - ధనుష్
అవును... ధనుష్ చెప్పిన సమాధానం ఇదే! తెలుగులో తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఈవెంట్ నిర్వహించిన పార్క్ హయత్ ఆడిటోరియం అంతా ఈలలు, చప్పట్లతో హోరెత్తింది. 






మల్టీస్టారర్ అయితే ఎన్టీఆర్ (Jr NTR)తో!ఒకవేళ తెలుగులో మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు? అని అడిగితే... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని చెప్పారు ధనుష్. ఆయన హీరోగా నటించకుండా కేవలం దర్శకత్వం మాత్రమే వహించాల్సి వస్తే... 'రాయన్'లో హీరోగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు? ఆ పాత్ర చేయమని ఎవరి దగ్గరకు వెళతారు? అని అడిగితే మరో సందేహం లేకుండా 'సూపర్ స్టార్ రజనీకాంత్' అని సమాధానం ఇచ్చారు ధనుష్.


తెలుగులో 'రాయన్' విడుదల చేస్తున్న ఏషియన్ సురేష్!
Raayan Telugu Release Date: 'రాయన్' సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఏషియన్ సంస్థలో ధనుష్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'కుబేర' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'రాయన్' ప్రీ రిలీజ్ వేడుకలో ఆ సినిమా అప్డేట్ గురించి అడగ్గా... నిర్మాత సునీల్ నారంగ్ చెప్పాలని ధనుష్ తెలిపారు.


Also Readమిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ బరిలో విక్రమ్ vs రవితేజ vs రామ్



Raayan Movie Cast And Crew: 'రాయన్' సినిమాలో ధనుష్ తమ్ముడిగా సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ నటించారు. ఇందులో ఎస్.జె. సూర్య విలన్ రోల్ చేశారు. ఇంకా కీలక పాత్రల్లో సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ప్రచార చిత్రాల్లో ఆయన నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది.


Also Read: మూఢ నమ్మకాలు, మాస్ మర్డర్స్, ఇన్వెస్టిగేషన్ - భయంతో కూడిన ఉత్కంఠ ఇచ్చేలా త్రిష సిరీస్



'రాయన్' సినిమాకు రచన - దర్శకత్వం: ధనుష్, నిర్మాణం: సన్ పిక్చర్స్, తెలుగులో విడుదల: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, సంగీతం: ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్, కూర్పు: ప్రసన్న జీకే, ప్రొడక్షన్ డిజైనర్: జాకీ, యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్.