Dhanush-Aishwaryaa Divorce Primary Custody Of Kids To Go To: తామిద్దరం విడిపోవాలని డిసైడ్ అయ్యాం. విడిపోతున్నాం అని ప్రకటించిన రెండేళ్లకి హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మ్యుచువల్ డివర్స్ కి అప్లై చేసుకున్నారు. చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో వాళ్లిద్దరు డివర్స్ కి అప్లై చేసుకున్నట్లు సన్నిహితులు చెప్పారు. ఇక ఈ ఇద్దరు సామరస్యంగా, స్నేహపూర్వంగా డివర్స్ తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా కూడా చెప్పారు. కోర్టులో ఎలాంటి వాదనలకు పోకుండా, మ్యుచువల్ గానే డివర్స్ తీసుకునేందుకు డిసైడ్ అయ్యారని అన్నారు.
పిల్లల కస్టడీ ఎవరికంటే?
ధనుష్, ఐశ్వర్యలకు పెళ్లై 18 ఏళ్లు అవుతోంది. కాగా.. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. యాత్ర, లింగా. ధనుష్ దంపతులు విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్ల కస్టడీ ఎవరికి వస్తుందని ఆలోచించారు చాలామంది ఫ్యాన్స్. అయితే, ప్రస్తుతానికి మాత్రం వాళ్లు ఐశ్వర్య రజనీకాంత్ కస్టడీలో ఉంటారని తెలుస్తోంది. “వాళ్లిద్దరు ఆఫీసియల్ గా చెన్నై కోర్టులో డివర్స్ ఫైల్ చేశారు. రెండేళ్ల నుంచి సపరేట్ గానే ఉంటున్నారు. దీని నుంచి బయటికి వచ్చేందుకు ఫోకస్ చేస్తున్నారు. జీవితంలో ముందుక సాగిపోవాలనే ఉద్దేశంతో డివర్స్‌కు ఫైల్ చేశారు” అని సన్నిహితుల్లో ఒకరు చెప్పినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేశారని, కోర్టులో ఎలాంటి వాదనలు, నెగటివిటీ లేకుండా డివర్స్ తీసుకునేందుకు సిద్ధపడినట్లు సన్నిహితులు అన్నారు. స్నేహపూర్వకంగానే విడిపోవాలని అనుకున్నారని, కోర్టులో కూడా అలానే చెప్పినట్లు తెలుస్తోంది.
2022లో ప్రకటన
చిన్న వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ధనుష్, ఐశ్వర్య. 2004లో వీళ్ల వివాహం జరిగింది. 'కాదల్ కొండేని' సినిమా చూసేందుకు అలబర్ట్ థియేటర్ కి వెళ్లిన ఐశ్వర్య ధనుష్ ని అప్రిషియేట్ చేస్తూ.. ఫ్లవర్స్ పంపిచడంతో వాళ్ల ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఐశ్వర్యకి ధనుష్ ఫోన్ చేయడంతో.. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి టైంకి ఐశ్వర్యకు 21 ఏళ్లు, ధనుష్ కి 24 ఏళ్లు.
ఇద్దరు అనోన్యంగానే ఉండేవాళ్లు. ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అయితే, అనుకోకుండా 2022 జనవరిలో ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. "పెళ్లైన 18 ఏళ్లకు విడిపోతున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు ఇద్దరు. 18 ఏళ్లు ఫ్రెండ్స్ గా, కపుల్ గా, పేరెంట్స్ గా, వెల్ విషర్స్ గా ఇద్దరు కలిసున్నాం. ఈ ప్రయాణంలో ఎదుగుదల, సర్దుబాటు, అలవాట్లు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అన్ని చూశాం. ఇప్పుడు ఇద్దరం వేర్వేరు దారులు చూసుకుంటున్నాం. ఐశ్వర్యం, నేను విడిపోవాలని అనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి.. మమల్ని అర్థం చేసుకుంటారని, దీని నుంచి బయటికి వచ్చేందుకు మాకు ప్రైవసీ ఇస్తారని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయా. స్ప్రెడ్ లవ్" అంటూ రాసుకొచ్చారు ధనుష్. ఇదే విషయాన్ని చెప్తూ.. ఐశ్వర్య కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు అఫీషియల్ గా ఇద్దరు కోర్టు మెట్లు ఎక్కారు.
Also Read: వామ్మో.. ‘పుష్ప 2’లో గంగమ్మ జాతర సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చుపెట్టారా? 5 చిన్న సినిమాలు తియొచ్చేమో!