Sivaji's Dhandoraa Trailer Out Now : శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా 'దండోరా'. ఈ మూవీకి మురళీ కాంత్ దర్శకత్వం వహించగా... 'కలర్ ఫోటో', 'బెదురులంక 2012' మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ నెల 25 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Continues below advertisement

ట్రైలర్ ఎలా ఉందంటే?

ఓ శవాన్ని ఊరి బయటకు కొందరు తీసుకొస్తుండగా... ఓ కుర్రాడు 'మా అవ్వ శవాన్ని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారన్నా?' అని అడుగుతాడు. 'మన చావు పుట్టుకలన్నీ ఆ ఊరి బయట రాసాడు రా దేవుడు' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మారుమూల ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు మంచి చ‌దువులు చ‌దువుకుని విదేశాలకు వెళ్తున్నా... సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంతర్గత సమస్యల్లో ప్రధానమైనది 'కులం'. ఈ సెన్సిటివ్ అంశాన్నే బ్యాక్ డ్రాప్‌గా 'దండోరా' తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్ హైప్ క్రియేట్ చేయగా ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది.

Continues below advertisement

ఆలోచింపచేసే డైలాగ్స్

ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ ఆలోచింపచేస్తున్నాయి. 'మ‌న చావు పుట్ట‌కుల‌న్నీ ఆ ఊరి బ‌య‌ట రాసిండ్రా ఆ దేవుడు..', 'ఒటేసినావ్‌రా అని' న‌వ‌దీప్ త‌న ప‌క్కనున్న వాడిని అడిగితే 'ఎంత పెద్ద మాటన్నావ్ స‌ర్పంచ్ నీ గుర్తుకే గుద్దినా' అని వాడంటాడు. దానికి  'ఓటుకి గుద్దినావో.. క్వార్ట‌ర్ గుద్ది ఇంట్లో పండినావో ఎవ‌డు చూసిండ‌వ‌య్యా' అని న‌వ‌దీప్ రియాక్ట్ కావ‌టం... 'చావు నుంచైనా త‌ప్పించుకోవ‌చ్చు కానీ.. కులం నుంచి త‌ప్పించుకోలేం రా' అంటూ మురళీధర్ గౌడ్ చెప్పడం,

'ఒకటి పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర .. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి' అంటూ కుల పెద్దలను ఉద్దేశించి వచ్చే డైలాగ్, 'మన బతుకులు మారాలంటే మనకు కావాల్సిందొక్కటి.. చదువు..చదువు..' అంటూ దేవీప్రసాద్ పాత్ర స్టేజ్‌పై చెప్పటం.. 'కల్లు మత్తు కాదు కదా సార్. రాత్రి తాగింది పొద్దుగాల దిగనీకి కులం మత్తు సార్.' అంటూ శివాజీ చెప్పే డైలాగ్స్ ఆలోచింపచేస్తున్నాయి.

Also Read : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్

స్టోరీ అదేనా?

ఊర్లో అట్ట‌డుగు వ‌ర్గాల నుంచి వ‌చ్చిన న‌వ‌దీప్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌వుతాడు. అక్క‌డి నుంచి ఊర్లో వ‌చ్చే స‌మ‌స్య‌లు, కుల పెద్ద‌ల‌కు, అత‌ని వ‌చ్చే ఘ‌ర్ష‌ణ‌లు ఎలా ఉంటాయ‌నే విష‌యాల‌ను చూపించారు. శివాజీ, బిందు మాధ‌వి పాత్రల మ‌ధ్య లవ్, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌ను హృద్యంగా చూపించారు. అలాగే శివాజీ రోల్‌లోని సీరియ‌స్ కోణాన్ని కూడా ఆవిష్క‌రించారు. నందు పాత్ర‌తో పాటు ర‌వికృష్ణ‌, మ‌ణిక పాత్ర‌ల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలాంటి కుల వ్య‌వ‌స్థ మీద ఆ గ్రామంలో ఎవ‌రు దండోరా వేశారు.. చివ‌ర‌కు ఏం జ‌రిగింది? అనే విష‌యాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.