మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'దేవర' (Devara Part 1 Movie). ఈ నెల (సెప్టెంబర్) 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల అవుతోంది. ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈ వారమే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోంది. మరి దానికి అతిథులు ఎవరు? తెలుసా? 


ముగ్గురు దర్శకులు... ముచ్చటగా ఎన్టీఆర్ కోసం!
Devara Pre Release Event Venue: దేవర ప్రీ రిలీజ్ వేడుక ఈ‌ నెల 22న... అంటే ఆదివారం హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. దానికి హైటెక్ సిటీ సమీపంలోని హైటెక్స్ నోవాటెల్ హోటల్ వేదిక కానుంది. ఆల్రెడీ అభిమానులకు పాసుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హీరోగా సినిమాలు చేసిన దర్శకులు ఇద్దరు... ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయబోయే దర్శకుడు మరొకరు హాజరు కానున్నారు.






'స్టూడెంట్ నెంబర్ వన్', ఆ తర్వాత‌ 'సింహాద్రి', 'యమ దొంగ' సినిమాలతో పాటు 'దేవర'కు ముందు పాన్ ఇండియా సక్సెస్ అందించిన 'ట్రిపుల్ ఆర్' తీసిన దర్శక ధీరుడు, జక్కన్న అని ఎన్టీఆర్ ముద్దుగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి ప్రీ రిలీజ్ వేడుకకు ఓ అతిథిగా రానున్నారు.‌ ఆయనతో పాటు మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు ఎన్టీఆర్ కథానాయకుడిగా సినిమా చేయబోయే 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం 'దేవర' ప్రీ రిలీజ్ వేడుకకు రానున్నట్లు తెలుస్తోంది.


Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు



ప్రీ రిలీజ్ వేడుక తర్వాత అమెరికాకు!
'దేవర' ప్రీ రిలీజ్ వేడుక పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ అమెరికా వెళతారని చిత్ర సన్నిహిత వర్గాలు చెప్పాయి. అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆల్రెడీ అమెరికాలో 'దేవర' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ రిలీజ్ సేల్స్ దుమ్ము దులుపుతున్నాయి. అతి త్వరలో 2 మిలియన్ మార్క్ చేరుకోవడం ఖాయం. ఇక ఎన్టీఆర్ అమెరికా పర్యటనతో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 
ఎన్టీఆర్ సరసన తంగం పాత్రలో నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటించిన 'దేవర' సినిమాలో బైరా అనే కీలక పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆయన కాకుండా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, చైత్ర రాయ్, అజయ్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.


Also Readకంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే