SIIMA 2024 Awards Nominations: ఏటా దుబాయ్ వేదికగా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుకలు ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరగనున్నాయి. తాజాగా 12వ ఎడిషన్ సైమా వేడుకల్లో పోటీ పడే సినిమాల జాబితాను జ్యూరీ మెంబర్స్ విడుదల చేశారు. ఇందులో 2023 సంవత్సరంలో విడుదలైన పలు చిత్రాలు నామినేషన్స్ దక్కించుకున్నాయి. బెస్ట్ మూవీ కేటగిరీలో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. తెలుగు నుంచి ‘దసరా’, తమిళం నుంచి ‘జైలర్’, కన్నడ నుంచి ‘కాటేరా’, మలయాళం నుంచి ‘2018’ సినిమాలు బరిలో నిలిచాయి.


‘దసరా’, ‘జైలర్’ 11 కేటగిరిలలో నామినేషన్లు


ఇక తెలుగులో నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ సినిమా సైమా 2024 అవార్డ్స్ లో ఏకంగా 11 కేటగిరీలలో నామినేషన్లు దక్కించుకుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. అటు నాని, మృణాల ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా 10 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఈ సినిమా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కింది. అటు తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా 11 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకుంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. అటు ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ కలిసి నటించిన ‘మామన్నన్’ సినిమా 9 కేటగిరీల్లో నామినేషన్స్ పొందింది.


‘కాటేరా’, ‘2018’ 8 కేటగిరాల్లో నామినేషన్లు


అటు కన్నడలో దర్శన్ హీరోగా నటించిన ‘కాటెరా’ సినిమా 8 కేటగిరీలలో నామినేషన్లు దక్కించుకుంది. ఈ సినిమాను తరుణ్ సుధీర్ తెరకెక్కించారు. అటు రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో- సైడ్ A’ సినిమా 7 కేటగిరీలలో నామినేషన్లు దక్కించుకుంది. అటు మలయాళంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ జంటగా నటించిన ‘2018’ సినిమా 8 నామినేషన్లు దక్కించుకుంది. ఈ సినిమాకు జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. అటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జ్యోతిక నటించిన 'కాథల్- ది కోర్' సినిమా 7 నామినేషన్లను పొందింది.  


ఆయా భాషల్లో పలు కేటగిరీలలో నామినేట్ అయిన సినిమాలు


తెలుగు


1. దసరా


2. హాయ్ నాన్న


3. బలగం


4. బేబీ


5. భగవంత కేసరి


6. విరూపాక్ష


తమిళం


1. జైలర్


2. మామన్నన్


3. సింహ రాశి


4. పొన్నియన్ సెల్వన్ 2


5. విదుతలై 1


కన్నడ


1. కాటేరా


2. సప్త సాగరదాచే ఎల్లో- సైడ్ A


3. ఆచార్ & కో


4. కౌసల్యా సుప్రజా రామ


5. క్రాంతి


మలయాళం


1. కాథల్: ది కోర్


2. 2018


3. ఇరట్ట


4. నాన్పకల్ నేరతు మైక్కం


5. నెరు


సెప్టెంబర్ 2024లో సైమా అవార్డుల వేడుక


సైమా 2024 అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో దుబాయ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఏర్పట్లు మొదలు పెట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.


Read Also: వివాదంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సాంగ్, పూరీ జగన్నాథ్ పై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం? కారణం ఏంటో తెలుసా?



Read Also: ప్రియదర్శికి చుక్కలు చూపిస్తోన్న నభా నటేష్ - ఫన్నీగా ‘భాగ్ సాలే’ సాంగ్, పెద్ద సైకోలా ఉందే!