నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా నటించిన సినిమా 'దసరా' (Dasara Movie). ఇందులో కీర్తీ సురేష్ కథానాయిక. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అని నాని పలు నగరాలు తిరిగి ప్రచారం చేశారు. తొలి రోజు సినిమాకు మంచి స్పందన లభించింది. కలెక్షన్స్ కూడా బావున్నాయి. 


ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Dasara First Day Collections : తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో 'దసరా'కు మంచి ఓపెనింగ్ లభించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సంక్రాంతి హిట్ సినిమాలను లైట్ మార్జిన్ తో అధిగమించింది.


మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాకు నైజాంలో 6.21 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నట సింహం బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' సినిమా రూ. 6.10 షేర్ కలెక్ట్ చేసింది. ఈ రెండు కంటే కంటే అర కోటి ఎక్కువ కలెక్ట్ చేసింది నాని 'దసరా'. ఆ సినిమాకు నైజాంలో ఫస్ట్ డే రూ. 6.78 కోట్ల షేర్ వచ్చింది. 


తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dsara Telugu States Collections : తెలుగు రాష్ట్రాల్లో 'దసరా' సినిమా మొదటి రోజు సుమారు 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. షేర్ వసూళ్లకు వస్తే... రూ. 14.30 కోట్లు అటు ఇటుగా ఉంటుందని తెలుస్తోంది. 


మొదటి రోజు 'దసరా' వసూళ్లు చూస్తే...
నైజాం : రూ.  6.78 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.  1.42 కోట్లు
సీడెడ్ : రూ. 2.36 కోట్లు
నెల్లూరు :  రూ. 35 లక్షలు
గుంటూరు :  రూ. 1.22 కోట్లు
కృష్ణా జిల్లా : రూ. 64 లక్షలు
తూర్పు గోదావ‌రి : రూ. 90 లక్షలు
పశ్చిమ గోదావ‌రి : రూ. 55 లక్షలు 


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తంగా రూ. 14.22 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా 'దసరా' రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తోంది.తెలుగులో స్టార్ హీరోస్ తర్వాత మిడ్ రేంజ్ హీరోల కలెక్షన్స్ చూసినా సరే... ఈ 'దసరా' టాప్ ప్లేసులో నిలిచింది. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, అఖిల్ అక్కినేని, అక్కినేని నాగ చైతన్య, నితిన్ సినిమాలు ఏవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు పది కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయలేదని ట్రేడ్ వర్గాల టాక్.


Also Read : ఐపీఎల్ ఓపెనింగ్‌కు గ్లామర్ టచ్ ఇస్తున్న రష్మిక, తమన్నా


ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా బావున్నాయని సమాచారం అందుతోంది. 'రంగస్థలం' నుంచి తెలుగులో రా అండ్ రియలిస్టిక్ సినిమాలకు ఆదరణ బావుంటోంది. లాస్ట్ ఇయర్ 'పుష్ప' సినిమాను కూడా అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక్క తెలుగులో కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. నార్త్ ఇండియాలో మొదటి రోజు 'దసరా'కు 40 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. తమిళ సినిమాల తరహాలో 'రా'గా సినిమాను తీసినట్లు విమర్శకులతో పాటు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. 


Also Read : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?