Dabba Cartel Crime Thriller Web Series OTT Release On Netflix: క్రైమ్ థ్రిల్లర్స్ అంటేనే ప్రేక్షకులను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఇప్పుడు చాలా ఓటీటీ ప్లాట్ ఫాంలు సైతం అలాంటి జానర్లలోనే పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలను అందిస్తున్నాయి. యువ నటులు సైతం థ్రిల్లర్ జానర్ కథాంశాలనే ఎంచుకుంటూ ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతున్నారు. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు వచ్చేస్తోంది. లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా 'డబ్బా కార్టెల్' (Dabba Cartel) క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) ఈ నెల 28 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 'వాళ్లు వండుతున్నారు. అది క్రిమినల్లీ గుడ్. డబ్బా కార్టెల్‌ను ఫిబ్రవరి 28 నుంచి చూడండి.' అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే, అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలక పాత్రలు పోషించారు.
ఐదుగురు గృహిణుల చుట్టూ సాగే కథ
ముంబై శివారు థానే బ్యాక్ డ్రాప్‌లో ఈ డబ్బా కార్టెల్ స్టోరీ నడుస్తుంది. అక్కడ డబ్బా వాలాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి ఫుడ్ డబ్బాల్లో ఫుడ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. వారి అక్రమ దందా, వారి విషయం తెలిసిన కొందరు వ్యక్తులు వారిని బెదిరించి డ్రగ్స్ సరఫరాను తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారు.?. అటు పోలీసులు, ఇటు మాఫియా నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు..? వంటి అంశాలు సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.