Suma's Project K Cooking Show Will Streaming On Aha: 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K'.. అందమైన సెలిబ్రిటీలు తమ కుకింగ్ నైపుణ్యాన్ని చూపించడం సహా ఆటలు, సరదా సంభాషణలు, టాస్కులతో ఎంటర్‌టైన్ చేస్తారు. 'ఆహా' స్ట్రీమింగ్ అయ్యే ఈ 'కుకింగ్ షో' ఇప్పటివరకూ 3 సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా, టాప్ యాంకర్ సుమ హోస్ట్‌గా.. 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' (CMPK) సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'CMPK' అంటూ ఓ కర్టసీని క్రియేట్ చేశారు. 'ఇది జస్ట్ కుకింగ్ షో మాత్రమే కాదు. కుకింగ్, కామెడీ, ట్విస్టులు ఇలా అన్నీ మసాలాలు ఉన్న అల్టిమేట్ కుకింగ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఆహ్లాదకరమైన వంటల ప్రయాణం కోసం సిద్ధంగా ఉండండి.' అంటూ సోషల్ మీడియా వేదికగా 'ఆహా' అనౌన్స్ చేసింది.

ఇప్పటివరకూ 3 సీజన్లలో ప్రముఖ యాంకర్స్, టీవీ యాక్టర్స్, సెలిబ్రిటీలు పాల్గొని ఎంటర్‌టైన్ చేశారు. అంతకు మించిన రేంజ్‌లో సీజన్ 4 ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో ప్రముఖ నటీనటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వెరైటీ రుచులు, సర్‌ప్రైజ్‌లతో మనల్ని ఎంటర్‌టైన్ చేయనున్నారు. వీరు వినోదంతో పాటు సరికొత్త రుచులను మనకు పరిచయం చేయనున్నారు. ఇక, సీజన్ 3ను నిహారిక కొణిదెల్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్‌ను మంచు లక్ష్మీప్రసన్న హోస్ట్ చేశారు.

Also Read: 6 నెలలు.. రోజుకు 8 గంటల ట్రైనింగ్ - ది మేకింగ్ ఆఫ్ 'ఛావా' వీడియో చూశారా?

రాజీవ్ కనకాల లీడ్ రోల్‌లో వెబ్ సిరీస్

ఈ కుకింగ్ షోతో పాటు పలు వెబ్ సిరీస్‌లు, కొత్త సినిమాలతో ఆహా ఈ ఏడాది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. మధ్య తరగతి కుటుంబం, అనుబంధాలు, ఆప్యాయతలకు ప్రాధాన్యత ఇస్తూ.. రూపొందుతోన్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'హౌమ్ టౌన్'. ఈ సిరీస్‌లో సీనియర్ యాక్టర్స్ రాజీవ్ కనకాలతో పాటు ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌‍ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని 'ఆహా' ప్రకటించింది. మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్‌లో సిరీస్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం సాగుతోంది. 

దీంతో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, ఈషారెబ్బా, పూర్ణ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్' (3 Roses). 2021లో ఆహాలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సీజన్ 2 సైతం ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతోంది. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో 'ఆహా' ఒరిజినల్ సిరీస్‌గా రూపొందుతోంది 'చిరంజీవ' కూడా 'ఆహా' ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. బుల్లితెర స్టార్, నటుడు 'సుడిగాలి సుధీర్' హోస్ట్‌గా వ్యవహరించిన కామెడీ గేమ్ షో 'సర్కార్' (Sarkaar) మంచి హిట్ అందుకుని ఇప్పటివరకూ 4 సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ 5 సైతం ప్రసారం కానున్నట్లు 'ఆహా' ప్రకటించింది.

Also Read: ఈ ఉగాదికి ETV Winలో సుమంత్ ఎక్స్ క్లూజివ్ ఫిల్మ్.. అనగనగా - 'వ్యాస్' సార్‌ను చూసేందుకు మీరు రెడీయేనా..