Anagana OTT Release Date: ఈ ఉగాదికి ETV Winలో సుమంత్ ఎక్స్ క్లూజివ్ ఫిల్మ్.. అనగనగా - 'వ్యాస్' సార్‌ను చూసేందుకు మీరు రెడీయేనా..

Anagana OTT Platform: సుమంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అనగనగా'. ఈ మూవీ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ మేరకు ఉగాదికి రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ రిలీజైంది.

Continues below advertisement

Sumanth's Anaganaga OTT Release Date On ETV Win: టాలీవుడ్ హీరో సుమంత్ (Sumanth), కాజల్ రాణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'అనగనగా' (Anaganaga). ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్'లో (ETV Win) ఈ ఉగాదికి (మార్చి 30) విడుదల కానుంది. సన్నీకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 'ఈటీవి విన్'తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా 'ఈటీవీ విన్' ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'ప్రేమ అనేది కేవలం కథ కాదు, ఎప్పటికీ మనతో నిలిచిపోయే భావోద్వేగం. ఈ వాలెంటైన్స్ డే, ప్రేమ మాయాజాలం. జీవితాన్ని ప్రత్యేకంగా మార్చే మరపురాని క్షణాలను జరుపుకొందాం.' అంటూ మేకర్స్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లు ఓ చోట కూర్చుని నవ్వుతూ మాట్లాడుకునే పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Continues below advertisement

ఇప్పటికే 'అనగనగా' ఫస్ట్ గ్లింప్స్, హీరో సుమంత్ లుక్ విడుదల కాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో సుమంత్ స్కూల్ టీచర్‌ వ్యాస్ సార్‌గా కనిపించబోతున్నారు. 'అనగనగా..' అంటూ చిన్నారులకు కథ చెబుతున్న గ్లింప్స్.. భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై వ్యాస్ సార్ వెళ్తున్న ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ పల్లెటూరి వాతావరణంలో స్కూల్ బ్యాక్ డ్రాప్ కథాంశంగా తెరకెక్కుతోంది. దర్శకుడు సన్నీ సంజయ్‌కు ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక, హీరోయిన్ కాజల్ రాణి సైతం ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ విహర్స్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Also Read: ఇండియన్ సినిమా హిస్టరీలో 'పుష్ప 2' రికార్డు - సెకండ్ ప్లేస్‌లో కలెక్షన్స్, మరో 5 విదేశీ భాషల్లో స్ట్రీమింగ్

సుమంత్ అప్ కమింగ్ మూవీస్..

సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కొత్త కథలతో హీరో సుమంత్ ప్రయోగాలు చేస్తుంటారు. ఆయన టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి దాదాపు 23 ఏళ్లయింది. కెరీర్ తొలినాళ్లలో మంచి లవ్ స్టోరీస్‌తో యూత్‌ను ఆకట్టుకున్నారు. 1999లో 'ప్రేమకథ' సినిమాతో తెరంగేట్రం చేసిన సుమంత్.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకున్నారు. యువకుడు, పెళ్లిసంబంధం, రామ్మాచిలకమ్మా, చిన్నోడు, స్నేహమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. గోదావరి, గోల్కొండ హైస్కూల్, సత్యం వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అంతటి విజయాలను చూడలేదు. మళ్లీ 2017లో 'మళ్లీ రావా'తో హిట్ కొట్టారు. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు అడపాదడపా అతిథి పాత్రల్లో నటించారు. చివరిగా గతేడాది 'అహం రీబూట్' సినిమాతో వచ్చినా అనుకున్నంత విజయం సాధించలేదు. 

ప్రస్తుతం సుమంత్ మహేంద్రగిరి వారాహి పేరుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఇదే దర్శకుడితో సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం' సినిమా తీయగా అది అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Also Read: 6 నెలలు.. రోజుకు 8 గంటల ట్రైనింగ్ - ది మేకింగ్ ఆఫ్ 'ఛావా' వీడియో చూశారా?

Continues below advertisement