థియేటర్లు దద్దరిల్లిపోయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman) స్పెషలిస్ట్ అని పేరు ఉంది. బేస్ మ్యూజిక్ చేయడంలో ఆయన ఎక్స్పర్ట్.‌ గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినిమా అంటే పూనకం వచ్చినట్టు తమన్ మ్యూజిక్ చేస్తారని పేరు ఉంది. ఇంతకు ముందు వచ్చిన కొన్ని సినిమాలలో ఆడియన్స్ చూశారు కూడా! ఈ సంక్రాంతికి రాబోతున్న 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) సినిమాకు కూడా అదే స్థాయిలో ఆయన మ్యూజిక్ చేశారు. 

తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్!'డాకు మహారాజ్' విడుదలకు రెండు రోజుల ముందు రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. హైదరాబాద్ సిటీ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వేదికగా ఆ కార్యక్రమం జరిగింది. అందులో 'డాకు...' సాంగ్ ప్లే చేశారు. అప్పుడు తమన్ సంగీతంలో బేస్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయి. వాటిని మళ్లీ తీసి ఏరేంజ్ చేయాల్సి వచ్చింది.‌ స్పీకర్లు పడడంతో తమన్ ఒక్కసారి నవ్వుకున్నారు. 

బాలయ్య గారితో తన సినిమా అంటే స్పీకర్లు కాలతాయని, కొత్త స్పీకర్లు రెడీగా పెట్టుకోవాలని, అందుకు తాను ఏమీ చేయలేనని, తనది వార్నింగ్ కాదని, సినిమాలో హై ఉండటం వల్ల అటువంటి మ్యూజిక్ ఇస్తానని తమన్ తెలిపారు.

'డాకు మహారాజ్' కంటే ముందు బాలకృష్ణ హీరోగా నటించిన కొన్ని సినిమాలకు తమన్ సంగీతం అందించారు. అందులో అన్నిటి కంటే 'అఖండ' భారీ హిట్. ఆ సినిమా మ్యూజిక్ దెబ్బకు కొన్ని థియేటర్లలో స్పీకర్స్ దెబ్బతిన్నాయని అప్పట్లో వినిపించింది. అమెరికాలోని కొన్ని థియేటర్లలో సౌండ్ ఎక్కువ ఉందనే కంప్లైంట్స్ కూడా వినిపించాయట. ఇప్పుడు మరోసారి అటువంటి కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది.

Also Read: మర్డర్స్‌లో మాస్టర్స్ చేసిన వైల్డ్ యానిమల్... 'డాకు మహారాజ్' రిలీజ్ ట్రైలర్ చూశారా?

'డాకు మహారాజ్' సినిమాకు తమన్ అందించిన సంగీతం ఒక హైలైట్ అవుతుందని చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉంది. ఆల్రెడీ 'దబిడి దిబిడి...' పాట మీద ట్రోల్స్ వచ్చాయి. అయితే ఆ సాంగ్ మాస్ జనాలకు బాగా ఎక్కింది. చార్ట్ బస్టర్ పాటగా నిలిచింది. మిగతా పాటలకు కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. సినిమాలో పాటలతో పాటు తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా. జనవరి 12న (Daaku Maharaaj Release Date) ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ టాప్ లీగ్ లోకి వెళుతుందో లేదో చూడాలి.

Also Read: వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో మోకాళ్ళ మీద మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్