థియేటర్లలోకి రావడానికి ముందు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) ఓటీటీ సెట్ అయ్యింది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ముందే అమ్మేశారు. ఇంతకీ, ఏ ఓటీటీ సంస్థలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందో తెలుసా?
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'డాకు మహారాజ్'
Daaku Maharaaj OTT Platform: ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ 'డాకు మహారాజ్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగులో ఇవాళ సినిమా విడుదల అయింది. అయితే... తమిళ, హిందీ వెర్షన్స్ కూడా రెడీ చేశారు. త్వరలో ఆయా భాషల్లో థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో సినిమా స్ట్రీమింగ్ కానుంది.
'డాకు మహారాజ్' సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ యువ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకం మీద ప్రముఖ దర్శకుడు (మాటలు మాంత్రికుడు, గురూజీ) త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. ఈ సంస్థల్లో రూపొందిన సూపర్ హిట్ సినిమాలు కొన్నిటిని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తీసుకుంది. ఇప్పుడు కూడా ఆ సంస్థకే 'డాకు మహారాజ్' వెళ్ళింది.
'డాకు మహారాజ్' సినిమాలో సీతారాం పాత్రలో బాలకృష్ణ నటించారు. ఆయనకు జంటగా ప్రగ్యా జైస్వాల్ నటించారు. వాళ్ళిద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. అఖండ తర్వాత మరోసారి వాళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రం ఇది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు మంచి టాక్ లభించింది. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఉన్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతంతో పాటు ఒక కీలకమైన సన్నివేశంలో వచ్చే క్యారెక్టర్ చేశారు. బాబీ డియోల్, రవి కిషన్, నితిన్ మెహతా తదితరులు విలన్ రోల్స్ చేశారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలో?
థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలో సినిమా వస్తుంది? అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువ వినబడుతుంది. హిందీ సినిమాలకు అయితే మినిమం ఎనిమిది వారాల థియేట్రికల్ విండో గ్యాప్ ఉంటుంది. కానీ, తెలుగులో అలా లేదు. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో వస్తున్నాయి. 'డాకు మహారాజ్' విషయంలో కూడా అదే జరగవచ్చని వినబడుతోంది. హిందీ వెర్షన్ రెడీ చేసినప్పటికీ... అక్కడ థియేటర్లలో రిలీజ్ చేయకపోవడం వెనుక అసలు కారణం అదే అయ్యి ఉంటుందని కొంత మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.