ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సిఎస్ఐ సనాతన్' (CSI Sanatan Movie). కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తుంది. ఈ శుక్రవారం (మార్చి 10న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు సీక్వెల్ తీయాలని నిర్మాత రెడీ అయ్యారు.
 
సిఎస్ఐ... ఓ ఫ్రాంచైజీలా!
'సిఎస్ఐ సనాతన్' చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా ఆయనకు తొలి చిత్రమిది. దీని తర్వాత 'వేదాంత్' అని మరో సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'సిఎస్ఐ సనాతన్' తరహాలో అదీ థ్రిల్లర్ చిత్రమే. చేతబడి, ఉమెన్ ట్రాఫికింగ్ అంశాలతో ఆ సినిమా రూపొందింది. ఆ తర్వాత ఆది సాయి కుమార్ సినిమాకు సీక్వెల్ చేయనున్నారు. 


'సిఎస్ఐ సనాతన్' సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశామని నిర్మాత అజయ్ శ్రీనివాస్ తెలిపారు. ''సిఎస్ఐ అంటే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అని అర్థం. మన సొసైటీలో చాలా క్రైమ్స్ ఉన్నాయి. ఆ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. అందుకని, సిఎస్ఐను ఒక ఫ్రాంచైజీలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ సీక్వెల్ ప్లాన్ చేశా. దాని స్టోరీ కూడా రెడీ అయ్యింది'' అని అజయ్ శ్రీనివాస్ వివరించారు.


అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్! 
ఆది సాయి కుమార్ నుంచి ఈ ఏడాది వస్తున్న తొలి చిత్రమిది. 'పులి మేక' వెబ్ సిరీస్ (Puli Meka Web Series)తో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు 2023లో వచ్చారు. ఇప్పుడు థియేటర్లలోకి వస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఆది సాయి కుమార్ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసినప్పటికీ మంచి విడుదల తేదీ కోసం వెయిట్ చేశామని, అందువల్ల విడుదల ఆలస్యం అయ్యిందని ప్రొడ్యూసర్ అజయ్ శ్రీనివాస్ తెలిపారు.


Also Read : 'యాంగర్ టేల్స్' రివ్యూ : నాలుగు కథలు, ఒక్కటే ఎమోషన్ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?






'సిఎస్ఐ సనాతన్' స్టోరీ డెవలప్ చేశాక... హీరోగా ఆది సాయి కుమార్ అయితే బావుంటుందని ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేశామని నిర్మాత అజయ్ శ్రీనివాస్ చెప్పారు. ఆది బాడీ లాంగ్వేజ్, హావభావాలు ఈ సినిమాకు సరిగ్గా సరిపోయాయని తెలిపారు. దర్శకుడికి బెస్ట్ ఇవ్వాలని ఆర్టిస్టుల విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా సెలెక్ట్ చేశానని అజయ్ శ్రీనివాస్ తెలిపారు. అనీష్ సోలోమాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చాడని, ప్రతి సన్నివేశంలో ఆర్ఆర్ అదిరిపోయిందని, థియేటర్ల నుంచి వచ్చిన తర్వాత కూడా గుర్తు ఉండేలా ఉంటుందని తెలిపారు.  


ఆది సాయి కుమార్ జోడీగా మిషా నారంగ్ (Misha Narang) నటించిన ఈ సినిమాలో 'బిగ్ బాస్' ఫేమ్ అలీ రెజా, నందినీ రాయ్ (Nandini Roy), తాక‌ర్ పొన్న‌ప్ప, మ‌ధు సూద‌న్, వాసంతి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : జి. శేఖ‌ర్, సంగీతం : అనీష్ సోలోమాన్, నిర్మాత : అజ‌య్ శ్రీనివాస్, ద‌ర్శ‌కుడు : శివ‌శంక‌ర్ దేవ్. 


Also Read : ‘ఆస్కార్’ ఖర్చులతో 8 సినిమాలు చెయ్యొచ్చు, ‘RRR’ టీమ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్!