Rajinikanth's Coolie Trailer Released: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా 'కూలీ' నుంచి ట్రైలర్ వచ్చేసింది. తలైవా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాగార్జున ఎంట్రీతో...
విలన్‌గా కింగ్ నాగార్జున ఎంట్రీతోనే ట్రైలర్‌లో గూస్ బంప్స్ తెప్పించారు లోకేశ్. 'ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలని తల మీద రాసిపెట్టి ఉంటది.' అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... పోర్ట్ ఏరియాలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ బ్యాక్ డ్రాప్‌గా మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.
అసలు పోర్ట్ ఏరియాలో జరిగేది ఏంటి? వెపన్స్ స్మగ్లింగా? గోల్డ్ స్మగ్లింగా? లేక మెడికల్ మాఫియానా? అనేది ఆసక్తికరంగా మారింది. దాహా రోల్‌లో పవర్ ఫుల్ గన్స్‌తో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ లుక్ అదిరిపోయింది. సౌబిన్ షాహిర్ పోర్టును తన అండర్‌లో ఉంచుకున్నట్లు తెలుస్తుండగా 14,400 మంది కూలీల్లో ఆ ఒక్క కూలీ 'తలైవా' అని అర్థమవుతోంది.
దేవాతో గేమ్స్ వద్దు
మూవీలో తలైవా రజినీ యాక్షన్ వేరే లెవల్‌లో ఉంది. '30 ఏళ్ల నుంచి ఒకన్ని ఆఫ్ లైన్‌లోనే ఉంచాను. వాడికి విషయం తెలిస్తే...' అన్న డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ వేరే లెవల్‌లో ఉంది. పోర్ట్ ఏరియాలో కూలీగా ఉంటే దేవా అక్కడ జరిగే అక్రమాలపై హిడెన్‌గా పోరాటం చేస్తూ... ఇల్లీగల్ యాక్టివిటీస్‌ను అడ్డుకుంటాడు.
తలైవా భారీ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా...' అంటూ సాగే డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. అసలు దేవా ఎవరు?, ఎందుకు 30 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్నాడు? పోర్ట్ ఏరియాలో జరిగే అక్రమాలేంటి? శ్రుతి హాసన్ తండ్రికి దేవాకు సంబంధం ఏంటి? సౌబిన్ షాహిర్ పోర్ట్ ఏరియాను తన అండర్‌లో ఉంచుకుని ఏం చేశాడు? ఉపేంద్ర, రజినీకాంత్ మూవీలో స్నేహితులా? ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.
ఈ మూవీలో తలైవాతో పాటు కింగ్ నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... ప్రస్తుత ట్రైలర్ ఆ హైప్ పదింతలు చేసింది. దీంతో రజినీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read: మనం హిట్ కొట్టినం... ఐయామ్ వెరీ హ్యాపీ - 'కింగ్డమ్' సీక్వెల్‌పై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?
ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మించారు. ఐమాక్స్ ఫార్మాట్‌లోనూ మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 14న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.