ఇటీవల కాలంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఏకంగా పాకిస్తాన్ వంటి దేశంలో నిషేధించబడి సంచలనాలు సృష్టించిన ఉర్దూ చిత్రం 'జాయ్ లాండ్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఎన్ని వివాదాలు ఎదుర్కొందో అంతకంటే ఎక్కువ ప్రశంసలు కూడా అందుకుంది. మార్చి 10, 2023న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటూ ఏకంగా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. సైమ్ సాదిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అలీ జునేజో, రస్తి ఫరూక్, అలీనా ఖాన్, సర్వత్ గిలానీ, సల్మాన్ పీర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కి సిద్ధమైంది. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ టికెట్ యాప్ బుక్ మై షో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.


ఈ మేరకు బుక్ మై షో లో జూలై 5 నుంచి 'జాయ్ ల్యాండ్' మూవీ రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ సినిమాని చూడాలంటే ఆడియన్స్ బుక్ మై షో లో రెంటల్ విధానంలో రూ.175 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉర్దూ, పంజాబీతో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్లా సిద్ధిక్ సంగీతం అందించిన ఈ సినిమాని అపూర్వ గురుచరణ్, సర్మద్ సుల్తాన్, సబిహా సమర్ సంయుక్తంగా నిర్మించారు. కాగా ట్రాన్స్ జెండర్ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ ప్రైజ్ అవార్డ్.. టొరంటో ఫిలిం ఫెస్టివల్ అఫిషియల్ సెలక్షన్.. అకాడమీ అవార్డ్స్ అఫీషియల్ పాకిస్థానీ ఎంట్రీ.. ఇన్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరి.. మాస్టర్ పీస్ ఆఫ్ పాకిస్తానీ మూవీల్యాండ్.. మార్వ్ లెస్లీ స్క్రిప్టెడ్ అండ్ యాక్టెడ్.. స్పెక్టాక్యులర్ మూవీ ఆఫ్ రీసెంట్ టైమ్స్ వంటి అవార్డ్స్ ని సైతం దక్కించుకుంది.


ఇన్ని అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా మాత్రం పాకిస్తాన్లో భారీ వివాదాలను ఎదుర్కొంది. ఎందుకంటే ఈ సినిమా పాకిస్తానీ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉందని అక్కడి మతచాందసవాసులు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సినిమా గే కల్చర్ను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుందని అందుకే సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొదట పాకిస్థానీ సమాచార ప్రసార శాఖ ఈ సినిమాపై బ్యాన్ విధించింది. ఇక ఆ తర్వాత మూవీ టీం సినిమాలో కొన్ని అభ్యంతర సన్నివేశాలని తొలగించి విడుదల చేయగా అప్పుడు థియేటర్లో రిలీజ్ కి అనుమతించారు. ఇక జాయ్ ల్యాండ్ కథ విషయానికొస్తే.. లాహోర్ లో నివసించే ఓ పాకిస్తానీ కుటుంబం చుట్టే ఈ కథ తిరుగుతుంది. ఓ డాన్స్ థియేటర్లో నాట్యం చేసే ఒక ట్రాన్స్ జెండర్ (హీరో) ఒక మహిళతో ప్రేమలో పడతాడు. వీరి మధ్య నడిచే ప్రేమాయణాన్ని సినిమాకే హైలెట్ గా చూపించారు. సినిమాలో ట్రాన్స్ జెండర్, మహిళ మధ్య ప్రేమ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.


Also Read : అందుకే ముద్దు పెట్టా, ‘బిగ్ బాస్’ నన్ను ఎందుకు ఆపలేదు - సల్మాన్‌పై ఆకాంక్ష ఫైర్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial