‘రంగబలి’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు నాగ శౌర్య. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. చాలా కాలం తర్వాత ఎలాంటి డైవర్షన్స్ పెట్టుకోకుండా మాట ఇచ్చిన్ ప్రకారం రంగబలి సినిమాలో నటించినట్టు చెప్పాడు. తను నటించిన కొన్ని సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయో కూడా వివరించాడు.
నాకే ఎందుకు ఈ సలహాలు
“ఒక సినిమా తీస్తున్నప్పుడు చాలా మంది వచ్చి సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేయమని సలహాలు ఇస్తారు. నా సినిమాలకే ఎందుకు సలహాలు ఇస్తారు, వేరే హీరోల సినిమాలకు ఎందుకు సలహాలు ఇవ్వరు. వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి డైరెక్షన్ చేయవచ్చు కదా. నేను చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఎందుకు ప్లాప్ అవుతున్నాయో నాకు మాత్రమే తెలుసు. అందుకే అప్పటి నుంచి ఒకటే అనుకున్నా ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కూడా నో చెప్పాలని డిసైడ్ అయ్యాను” అని అన్నారు. ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా దర్శకుడు తను అనుకున్నట్టుగానే తీసిన సినిమా ‘రంగబలి’. ఇది తప్పకుండా హిట్ అవుతుందని నాగ శౌర్య అంటున్నాడు. దర్శకుడు, నిర్మాత, హీరో ఒకే మాట ఉంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడు.
ఆ సినిమా అందుకే ప్లాప్
“ఒక సినిమా చేశాను. అందుకోసం భారీగా శరీరంలో మార్పులు కూడా చేసుకున్నా. కానీ మొదట్లో చెప్పినట్టుగా కాకుండా కొన్ని మార్పులు చేశారు. షూటింగ్ జరిగేటప్పుడే ఇది ఘోరంగా ప్లాప్ అవుతుందని చెప్పాను. కానీ నా మాట వినలేదు. కథ చెప్పినప్పుడు భారీ సెట్టింగ్ అలా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సెట్ కి వెళ్తే మరొక విధంగా ఉంది. అప్పుడే అన్నాను ఇలా చేస్తే సినిమా ప్లాప్ అవుతుందని.. అయినా వినిపించుకోలేదు. కానీ ఆ సినిమా ఘోరంగా పరాజయం అయ్యింది” తన సినిమా విషయంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా పేరు మాత్రం బయటపెట్టలేదు. ఇలా సలహాలు ఇచ్చే వ్యక్తుల మాటలు వింటే సినిమా నాశనం అవుతుందని అన్నారు.
‘రంగబలి’ సినిమాలో యుక్తి దరెజా నాగశౌర్యకి జోడీగా నటించింది. జులై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్‌గా నటిస్తున్నాడు.‘ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Also Read; చియాన్ విక్రమ్ 'తంగళన్' వచ్చేది అప్పుడేనట? - ఆ మూవీ రిలీజ్ వాయిదానే కారణమా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial