Chittibabu About Director Surya Kiran: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య కిరణ్. బాల నటుడిగా ఇడస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ (సోమవారం నాడు) చనిపోయారు. ఆయన మృతిపట్ల దక్షిణాది సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.


ఆయన మృతికి కారణం డ్రగ్స్ బ్యాచేనా?


సూర్య కిరణ్ మృతికి కారణం డ్రగ్స్ బ్యాచేనని సినీ విశ్లేషకుడు, నిర్మాత చిట్టి బాబు తెలిపారు. దురాలవాట్ల కారణంగానే ఆయన చనిపోయారని వెల్లడించారు. “దురలవాట్లు ఎంత మంచి వ్యక్తినైనా నాశనం చేస్తాయి. సూర్య కిరణ్ ఏడు, ఎనిమిది వందల సినిమాలు చేశాడు. దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ కల్యాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విడిపోయారు. బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ డమ్ రావడం అనేది ఒక అదృష్టం. అందరికీ అది రాదు. పేరు వస్తున్నా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతగా వ్యవహరించాలి. దేనినైనా కొనగలం కానీ, ఆరోగ్యాన్ని కొనలేం. ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకుంటేనే ఏమైనా అనుభవించగలుగుతాం. చాలా మంది నటులు దురలవాటల్లకు బానిసలై చనిపోయారు. మహానటి సావిత్రి కూడా తాగుడు వ్యసనానికి బలైపోయింది. సూర్య కిరణ్ కూడా జాండిస్ తోనే చనిపోయారు. దానికి కారణం తాగుడు అలవాటు. ముందు జాండిస్ వచ్చింది. జాగ్రత పడితే బాగుండేది. కానీ, తను పట్టించుకోలేదు. మళ్లీ తిరగబడింది. ఆయనకు బిగ్ బాస్ డ్రగ్ బ్యాచ్ తో సంబంధాలు ఏర్పడ్డాయి. బిగ్ బాస్ ఓ దరిద్రపు ప్రోగ్రాం. అలాంటి ప్రోగ్రామ్ వల్లే డ్రగ్స్ లాంటి దరిద్రాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఆ షో నిర్వాహకులు అల్పులను అందలానికి ఎక్కించి చెడగొడుతున్నారు. బిగ్ బాస్ గ్యాంగ్ తోనే సూర్య కిరణ్ కూడా చెడిపోయారు. వారి కారణంగానే ఆయన జాండిస్ తిరగబడింది. చివరకు మరణానికి కారణం అయ్యింది” అని చెప్పుకొచ్చారు.


నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు


సూర్య కిరణ్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత సహాయన నటుడిగా చేశారు. తెలుగులో ‘సత్యం’ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ధన 51’, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజు భాయ్‌’, ‘చాప్టర్‌-6’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బిగ్‌ బాస్‌ సీజన్‌-4 లోనూ కంటెస్టెంట్‌ గా హౌస్ లోకి అడుగు పెట్టారు. చక్కటి ఆట తీరుతో ఆకట్టుకున్నారు. చెన్నైలో పుట్టి పెరిగారు. సూర్య కిరణ్‌ సోదరి సుజిత కూడా నటిగా రాణిస్తున్నారు. హీరోయిన్ కల్యాణిని ప్రేమ వివాహం చేసుకున్న సూర్య కిరణ్‌, కొంతకాలం తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నారు.


Read Also: వాళ్లో మలయాళీ లోఫర్స్, అదో చెత్త మూవీ - ‘మంజుమ్మెల్ బాయ్స్’ రచయిత తీవ్ర విమర్శలు