మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులలో దర్శకుడు బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) ఒకరు. వాళ్ళిద్దరి కలయికలో 'వాల్తేరు వీరయ్య' సినిమా వచ్చింది. సంక్రాంతి బరిలో విడుదలైన ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మరొక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తమిళ్ హీరో నటించినున్నారని‌ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Continues below advertisement

చిరంజీవి సినిమాలో కార్తీ!?Tamil Actor Karthi To Play Key Role In Chiranjeevi - Bobby Kolli Movie?: కోలీవుడ్ స్టార్ సూర్య తమ్ముడిగా తమిళ సినిమా ఇండస్ట్రీలో కార్తీ అడుగు పెట్టారు. అన్న చాటు తమ్ముడిగా కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సూర్య కంటే కార్తీ చాలా బాగా తెలుగు మాట్లాడతారు. తెలుగులోనూ ఆయన సినిమాలు ఘన విజయాలు సాధించాయి. కింగ్ అక్కినేని నాగార్జునతో ఊపిరి సినిమా చేశారు కార్తీ. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారట. 

చిరంజీవి - బాబీ సినిమాలో ఒక కీలక పాత్రకు కార్తీని సంప్రదించారని, అందుకు ఆయన ఓకే అన్నారని తెలిసింది. అది నిజమైతే... 'ఊపిరి' తర్వాత కార్తీ నటించనున్న తెలుగు సినిమా ఇదే అవుతుంది. 

Continues below advertisement

బాబీ ఫార్ములా మళ్లీ రిపీట్!'వాల్తేరు వీరయ్య'లో మాస్ మహారాజా రవితేజ చేత ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేయించారు బాబీ.  ఇప్పుడు చిరుతో చేస్తున్న రెండో సినిమాకు అటువంటి ఫార్ములాను రిపీట్ చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఏమో!? ఇందులో మరొక యంగ్ హీరోకు కీలక పాత్రను క్రియేట్ చేశారు. కార్తీకి మల్టీస్టారర్స్ చేయడం కొత్త ఏమీ కాదు. అరవింద్ స్వామితో కలిసి ఆయన నటించిన 'సత్యం సుందరం' తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది.

Also Readనిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ ప్రొడ్యూస్ చేయనున్నారు ఈ చిత్రానికి 'మిరాయ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు - సినిమాటోగ్రాఫర్ కార్తీక ఘట్టమనేని వర్క్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Readకింగ్‌డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ