Chiranjeevi's Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న'భోళా శంకర్' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. తమిళ హీరో అజిత్ 'వేదాళం' రీమేక్ గా వస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 11 న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'భోళా శంకర్' టీజర్ మెగా అభిమానులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. చిరు 'భోళా శంకర్‌'లో తన డబ్బింగ్ పూర్తి చేశారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.


మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ (Mehar Ramesh) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా చిరు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ను వదిలారు.  'భోళా శంకర్' డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, ఈ మూవీ రూపుదిద్దుకున్న విధానం చాలా సంతృప్తి కలిగించిందని వెల్లడించారు. "భోళా శంకర్ సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందం కలిగించింది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంద" అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. 'భోళా శంకర్' ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందన్న ఆయన.. థియేటర్లో కలుద్దాం అంటూ #భోలాశంకర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. దీంతో బాస్ మళ్లీ త్వరలోనే వెండితెరపై మ్యాజిక్ చేయనున్నాడని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






ఇక 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah) హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాదు మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్(Keerthi Suresh) నటిస్తోంది. ఆమెతో పాటు సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.


Read Also : Jailer: ‘కావాలా’ అంటూ స్టెప్పులతో హోరెత్తిస్తున్న తమన్నా - ‘జైలర్’ ఫస్ట్ సింగిల్‌లో డ్యాన్స్ అదుర్స్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial