Manchu Lakshmi: టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. మోహన్ బాబు సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కొడుకులు విష్ణు, మనోజ్ కూతురు లక్ష్మీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఓ వైపు కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూనే మరో వైపు సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే మంచు మనోజ్ తాను ప్రేమించిన భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని, కానీ లక్ష్మీనే తండ్రిని ఒప్పించి తమ్ముడికి దగ్గరుండి పెళ్లి చేసింది అనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మంచు లక్ష్మీ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. 


వాళ్ల పెళ్లి జరగాలని యాదాద్రిలో మొక్కుకున్నాను: మంచు లక్ష్మీ


మంచు మనోజ్-మౌనిక ల పెళ్లిలో ప్రధాన పాత్ర పోషించింది లక్ష్మీ. మొదట్నుంచీ పెళ్ళి జరిగే వరకూ అన్నీ తానై చూసుకుంది. అయితే ఈ విషయంపై వచ్చిన పలు మీడియా కథనాల మీద తాజా ఇంటర్వ్యూలో స్పందించిందామె. మనోజ్ పెళ్లి విషయంలో తమ కుటుంబంలో మనస్పర్థలు వచ్చినమాట నిజమేనని అంది. అయితే తర్వాత మెల్లగా అన్నీ సర్దుకున్నాయని చెప్పింది. మనోజ్-మౌనిక ల పెళ్లి జరగాలని తాను యాదాద్రిలో మొక్కుకున్నానని చెప్పింది. తన తండ్రి మనసు మార్చాలని దేవుడిని కోరానని తెలిపింది. ఆ దేవుడు ఆలకించాడని, మనోజ్ పెళ్లి జరిగిందని తెలిపింది. 


పెళ్లికి ముందు నా దగ్గరే ఉన్నారు


మనోజ్ పెళ్లి విషయంలో తమ రెండు కుటుంబాలలో చాలా ఈక్వేషన్స్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. వాళ్ల ప్రేమ గురించి తెలియడం, నిజంగానే పెళ్లి చేసుకుంటారా అనే సందేహాలు రెండు ఫ్యామిలీస్ లో ఉన్నాయని అంది. నిజంగా వాళ్లు ప్రేమించుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు, ప్రేమకు ఏదీ అతీతం కాదు కదా అని వాళ్ల పెళ్లి తన ఇంటి వద్దే చేశానని చెప్పింది. పెళ్ళికి ముందు కూడా వాళ్లు ఇద్దరూ తన వద్దే ఉన్నారని, పెళ్లి తర్వాత వేరే ఇల్లు తీసుకున్నారని తెలిపింది లక్ష్మీ.  


అన్నీ ఇప్పుడు అడుగుతుంది, నేను ఆటపట్టిస్తున్నా


మనోజ్ తనకు ఏ కష్టం వచ్చినా తానే ముందుండేవాడని, అందుకే తన ప్రేమకు తాను అండగా నిలబడ్డానని చెప్పింది లక్ష్మీ. మౌనిక అప్పుడప్పుడూ తనకు ఫోన్ లు చేసి వంటల గురించి అడుగుతుందని, ఏది ఎంత వేయాలి, ఎలా చేయాలి అడుగుతుందని తాను చెప్పకుండా ఆటపట్టిస్తున్నానని నవ్వుతూ చెప్పింది. 


పిల్లలంటే ఇష్టం, రాజకీయాల మీద ఆసక్తి లేదు


ఇక ఇదే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది లక్ష్మీ. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పింది. తాము కూడా ముగ్గురు పిల్లల్ని కనాలని అనుకున్నానమని, అయితే దేవుడు తమకు ఒక అమ్మాయినే ఇచ్చాడని అంది. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తనకు రాజకీయాల మీద అంతగా ఆసక్తి లేదని చెప్పింది లక్ష్మీ. కానీ సేవా కార్యక్రమాలంటే ఇష్టమని తెలిపింది. 


Also Read: రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ విడిపోతున్నారా - ఆ వీడియో దేనికి సంకేతం?